నలభై ఏళ్లలో ఏం ఉద్ధరించారు
కాంగ్రెస్‌పై తలసాని ఫైర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎంను తక్కువ చేసి మాట్లాడితే ప్రజలు ప్రతిపక్ష నేతల నాలుక చీరేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన కేసీఆర్, కేటీఆర్‌ను ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. నలభై ఏళ్ల కాంగ్రెస్ హయాం లో ఏం ఉద్ధరించారో చెప్పాలన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం ను కొనియాడాల్సింది పోయి.. కళ్లు లేని కబో దుల్లా ప్రతిపక్ష నేతలు వ్యవహరిస్తున్నారన్నా రు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ.3,600 కోట్లు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించ కుండా విద్యార్థులను రోడ్డుపాలు చేస్తే.. వాటిని తీర్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించా రు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల గత వైఫల్యాలను ఎండగడతామన్నారు. బచ్చాలమైన తాము అన్ని సంక్షేమ కార్య క్రమాలను అమలు చేస్తుంటే.. 40 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన నాయకులను ప్రజలు ఎందుకు పక్కకు పెట్టా రో చెప్పాలన్నారు. నానక్‌రాంగూడలో భవ నం కూలిన ఘటనపై కేటీఆర్‌ను రాజీనామా చేయమనడం ప్రతిపక్షా ల ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. గురు కుల ట్రస్టు భూముల్లో అక్రమ భవనాలను కూల్చివేస్తుంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయ న్నారు.దాదాపు రూ.1,900 కోట్లతో హైదరా బాద్ పరిసర మున్సిపాలిటీల్లో మంచినీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
గతంలో ఉన్న ఏసీడీపీ నిధు లను 100 శాతం ఆయా నియోజకవర్గ శాస నసభ్యులే వాడుకునే విధానాన్ని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కోరిక మేరకు నిబం ధనలను సడలించిన విషయాన్ని గుర్తుచే శారు. ఆగమేఘాల మీద ప్రగతి భవన్ పూర్తి యితే.. గతంలో ముఖ్యమంత్రి ప్రారంభిం చిన క్రిస్టియన్, కురుమ భవన్లు ఇంకా పూర్తి కాలేదన్న విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ, వాటిపై కోర్టులోకేసు నడుస్తోందని తలసాని సమాధానం ఇచ్చారు.