Talasani srinivasyadav
-
బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన తలసాని
సాక్షి, హైదరాబాద్: వీలైనంత త్వరగా సినిమా చిత్రీకరణకు అనుమతిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కార్యాలయంలో సినీ ప్రముఖులతో గురువారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హీరో నాగార్జున, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, డి. సురేష్‌బాబు, సుప్రియ, మా అధ్యక్షులు నరేష్, తదితరులు హాజరయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ల ప్రారంభంపై చర్చించామని, ఇందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దానిపై పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు. (సినీరంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది) ఎలాంటి ఇబ్బందులు లేవనే పోస్టు ప్రొడక్షన్స్‌కు అనుమతిచ్చామని, విధానపరమైన నిర్ణయాలను రూపొందించామని చెప్పారు. ఇక సినీ రంగం ప్రతినిధుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుళ్తామని, ఆయన అమోదించగానే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న వారినే చర్చలకు పిలిచామని తెలిపారు. సమావేశాలకు అందరినీ పిలవబోమని, అసోషియేషన్ ప్రతినిధులను మాత్రమే పిలుస్తామన్నారు. బాలకృష్ణ మాట్లాడినట్టుగా చెబుతున్న వీడియో పాతది అంటున్నారని, దీనిపై క్లారిటీ వచ్చాక మాట్లాడతానని తలసాని చెప్పారు. హీరో నాగార్జున మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తమ విషయంలో చాలా త్వరగా స్పందిస్తోందన్నారు. తలసాని వల్లే ఇదంతా సాధ్యమైందని నాగార్జున వ్యాఖ్యానించారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చిత్రీకరణలపై చర్చించామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాలేకపోవడంతో హోం సెక్రటరీ రవితో చర్చించామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. (సినీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం) -
అమ్మవారి బోనం అపురూపం
హైదరాబాద్: 203 ఏళ్ల ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం. ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న అమ్మవారి బోనాల జాతరలో సమర్పించేందు కు బంగారు బోనాన్ని తయారుచేయిస్తున్నారు. బోనం తయారీ టెండర్‌ను దక్కించుకున్న మా నేపల్లి జువెలర్స్ ఇప్పటికే 94 శాతం పనులను పూర్తి చేసింది. అమ్మవారికి చేయించిన బంగారు బోనం ఎంతో అద్భుతంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం మానేపల్లి జూవెలర్స్‌లో బోనం తయారీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమ్మవారికి వినియోగించకుండా ఉన్న నగలను కరిగించి బోనం తయారు చేయాలని ఆలోచించి.. దాన్ని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. వారు వెంటనే దీనికి ఒప్పుకుని ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 8.30 గంటలకు ఎక్సైజ్ మంత్రి పద్మారావు బంగారు బోనాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర ణ్‌రెడ్డికి అందచేస్తారని తెలిపారు. నిజామా బాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఇంద్రకరణ్‌రెడ్డి అందిస్తారని, అక్కడి నుంచి 2 వేల మంది లలితాపారాయణ సత్సంగ్ సభ్యులు, మహిళల ఆధ్వర్యంలో బోనాలతో అమ్మవారి దేవాలయానికి ర్యాలీగా బయలుదేరుతారని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బంగారు బోనం అమ్మవారికి సమర్పించనున్నామని వివరించారు. బోన భాగ్యం అన్ని ఆభరణాల మాదిరిగా కార్ఖానాల్లో కాకుండా అమ్మవారి సన్నిధిలోనే బంగారు బోనం తయారు చేస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే పనులకు ఆటంకం కలగడంతోపాటు నియమనిష్టలకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో గోప్యంగా ఉంచారు. - దేవాలయానికి చెందిన 3 కిలోల 80 గ్రాముల బంగారాన్ని కరిగించి ఈ బోనం తయారు చేస్తున్నారు. అమ్మవారి బోనం, దానిపై కలశ చెంబు, దీప ప్రమిద ఉంటుంది. - ఈ నెల 15న బోనం తయారీ పని మొదలైంది. 10 మంది నియమనిష్టలతో దీన్ని తయారుచేస్తున్నారు. - ఈ బోనంపై దేవాలయంలోని గర్భగుడిలో ఉండే మహంకాళి, మాణిక్యాలమ్మల మాదిరే బొమ్మలను తీర్చిదిద్దారు. ఈ బోనంపై 280 వజ్రాలను పొదిగి మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. - బంగారు ఆభరణాల తయారీకి యంత్రాలను వాడతారు. అమ్మవారి బోనం కావడంతో దీన్ని మొత్తం చేతిపనితోనే తయారు చేస్తున్నారు. రసాయనాలను వాడడంలేదు. కోట్ల వ్యాపారంలో లేని సంతృప్తి ఈ బోనాల్లో అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నారని తెలిసి ప్రపంచవ్యాప్తంగా దీని కోసం ఆసక్తిగా భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మవారి భక్తులమైన మా కుటుంబానికి ఈ బంగారు బోనం తయారు చేసే పనులు దక్కడం అమ్మవారి కృపతోనే సాధ్యమైంది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. కోట్ల రూపాయల వ్యాపారంలో లేని సంతృప్తి ఈ బోనం తయారీలో మా కుటుంబానికి దక్కింది. – మానేపల్లి మురళీకృష్ణ -
ఉచిత చేప పిల్లల పంపిణీ భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం అమోఘమని కేరళ మత్స్యశాఖ మంత్రి మెర్సికుట్టి అమ్మ ప్రశంసించారు. మంగళవారం ఆమె సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మెర్సికుట్టి అమ్మ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో మత్స్యరంగ అభివృద్ధికోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని, కేరళలో కూడా వీటి అమలును పరిశీలిస్తామన్నారు. తలసాని ఆమెకు తెలంగాణ ప్రభుత్వం మత్స్యరంగ అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. అనంతరం కేరళ మంత్రి మెర్సికుట్టి అమ్మకు తలసాని మెమెంటో అందజేసి సత్కరించారు. -
నలభై ఏళ్లలో ఏం ఉద్ధరించారు
కాంగ్రెస్‌పై తలసాని ఫైర్ సాక్షి, హైదరాబాద్: ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎంను తక్కువ చేసి మాట్లాడితే ప్రజలు ప్రతిపక్ష నేతల నాలుక చీరేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన కేసీఆర్, కేటీఆర్‌ను ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. నలభై ఏళ్ల కాంగ్రెస్ హయాం లో ఏం ఉద్ధరించారో చెప్పాలన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం ను కొనియాడాల్సింది పోయి.. కళ్లు లేని కబో దుల్లా ప్రతిపక్ష నేతలు వ్యవహరిస్తున్నారన్నా రు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ.3,600 కోట్లు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించ కుండా విద్యార్థులను రోడ్డుపాలు చేస్తే.. వాటిని తీర్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించా రు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల గత వైఫల్యాలను ఎండగడతామన్నారు. బచ్చాలమైన తాము అన్ని సంక్షేమ కార్య క్రమాలను అమలు చేస్తుంటే.. 40 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన నాయకులను ప్రజలు ఎందుకు పక్కకు పెట్టా రో చెప్పాలన్నారు. నానక్‌రాంగూడలో భవ నం కూలిన ఘటనపై కేటీఆర్‌ను రాజీనామా చేయమనడం ప్రతిపక్షా ల ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. గురు కుల ట్రస్టు భూముల్లో అక్రమ భవనాలను కూల్చివేస్తుంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయ న్నారు.దాదాపు రూ.1,900 కోట్లతో హైదరా బాద్ పరిసర మున్సిపాలిటీల్లో మంచినీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో ఉన్న ఏసీడీపీ నిధు లను 100 శాతం ఆయా నియోజకవర్గ శాస నసభ్యులే వాడుకునే విధానాన్ని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కోరిక మేరకు నిబం ధనలను సడలించిన విషయాన్ని గుర్తుచే శారు. ఆగమేఘాల మీద ప్రగతి భవన్ పూర్తి యితే.. గతంలో ముఖ్యమంత్రి ప్రారంభిం చిన క్రిస్టియన్, కురుమ భవన్లు ఇంకా పూర్తి కాలేదన్న విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ, వాటిపై కోర్టులోకేసు నడుస్తోందని తలసాని సమాధానం ఇచ్చారు. -
రాజధానిలో 25 లక్షల మొక్కలు
జూలై 11న నాటుతామన్న మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో జూలై 11న 25 లక్షల మొక్క లు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. హరితహారం కార్యక్రమంపై మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలసి మంత్రి తలసాని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6 నుంచి 10 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తలసాని సూచించా రు. మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని 27 కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 20 తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మరోసారి సమావేశమవుతామన్నారు. హరితమయం చేద్దాం... మొక్కల పెంపకం ద్వారా నగరాన్ని హరి తమయం చేద్దామని మహమూద్ అలీ పిలుపునిచ్చారు. రెండేళ్లుగా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయామని, ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున విరివిగా మొక్కలు నాటాల న్నారు. కాలుష్యం బారి నుంచి బయట పడాలంటే చెట్ల పెంపకమే ఏకైక మార్గమని నాయిని అన్నారు. సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రేటర్లో 10కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకలేదని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. పశుసంవర్థక శాఖ పరిధిలో ఉన్న వివిధ సొసైటీల ప్రతినిధులతో శుక్రవారం ఆయన సచివాలయంలో సమీక్షించారు. వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వెటర్నరీ పోస్టుల భర్తీని శాఖాపరంగా నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. నెలకో జిల్లా పర్యటిస్తానని, ఈ నెల 18న నల్లగొండ జిల్లాలో పర్యటించి వివిధ సొసైటీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నారు. కులానికి 10 సంఘాలు కాకుండా ఎన్నికలు నిర్వహించుకుని ఒక జిల్లాలో ఒకటే వృత్తి సంఘం నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా గొర్రెలు, మేకల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. రూ.48.35 కోట్లతో మత్స్య శాఖ పరిధిలోని 4,695 చెరువుల్లో నీటి విస్తీర్ణం ఆధారంగా చేపల విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు. రూ.16.48 కోట్లతో 100 యూనిట్లలో కేజ్ కల్చర్ పద్దతిన చేపల పెంపకం చేపడతామన్నారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు కశ్మీర్ తరహా ప్యాకేజీ ఇవ్వాలి
♦ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ ♦ విశ్వనగరం పనులకు మూడు చోట్ల శంకుస్థాపనలు ♦ 3 మల్టీలెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు ప్రారంభం ♦ విశ్వనగరానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది: దత్తాత్రేయ హైదరాబాద్: దశాబ్దాలపాటు అణచివేతకుగురై కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు బిహార్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల తరహాలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మల్టీలెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి 54 జంక్షన్లను గుర్తించామని, వీటి నిర్మాణానికి కేంద్రం సాయం కోరతామని చెప్పారు. తమకు న్యాయంగా దక్కాల్సిన నిధులను కేంద్రం ఇచ్చి తీరాల్సిందేనన్నారు. విశ్వనగరం పనుల్లో భాగంగా ఆదివారం కూకట్పల్లి, బంజారాహిల్స్, మాదాపూర్‌లో నిర్మించతలపెట్టిన మల్టీలెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి. తొలుత జేఎన్టీయూ రెండో గేట్ నుంచి మలేసియా టౌన్షిప్ వరకూ రూ.113 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మల్టీలెవెల్ ఫ్లైఓవర్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. కూకట్‌పల్లితో పాటు నగరంలోని అన్ని రద్దీ కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు మల్టీలెవెల్ ఫ్లైఓవర్లను నిర్మించేందుకు రూ. 20 వేల కోట్లతో ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడకముందు విపక్షాలు ఎన్నో దుష్ర్పచారాలు చేశారని, ముఖ్యంగా భూముల ధరలు తగ్గుతాయని, నగరంలో శాంతిభద్రతల సమస్య నెలకొంటుందని ప్రచారం చేశాయని, కానీ ఇప్పటి వరకు నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పారు. నగర ప్రజలకు 24 గంటలూ విద్యుత్ అందిస్తున్నామని, రాష్ట్రానికి పెట్టుబడులు విరివిగా వస్తున్నాయని, పాత ఐటీ పరిశ్రమలకు తోడు కొత్తగా మరిన్ని సంస్థలు కార్యకలాపాలను సాగించేం దుకు ముందుకొచ్చాయని తెలిపారు. నగరంలో నివసిస్తున్న తెలంగాణేతర ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై, తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని నమ్మవద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. కేంద్రం సహకరిస్తుంది: దత్తాత్రేయ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద రూ.510 కోట్ల వ్యయంతో నిర్మించబోయే మల్టీలెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పలువురు రాష్ట్ర మంత్రులతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద నగరంగా, దేశంలోనే నంబర్ 1 నగరంగా మారబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను అత్యధికంగా రాబట్టి విశ్వనగర ప్రణాళికకు తాము కూడా సహకరిస్తామన్నారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే.. ఆయనను తీసుకొచ్చే బాధ్యత తనదేనన్నారు. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతున్నాం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. మాదాపూర్‌లో రూ.266 కోట్ల వ్యయంతో అయ్యప్ప సోసైటీ, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ పార్క్ జంక్షన్లో నిర్మించే మల్టీలెవెల్ ఫ్లైఓవర్ పనులకు పలువురు మంత్రులతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో 800 కి.మీ. వైట్ టాపింగ్స్ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ జోన్లో మంచినీటి వసతి, నాణ్యమైన కరెంట్‌ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, చింతల రాంచంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నా జోలికొస్తే మీ బండారం బయట పెడతా
- డిసెంబర్లోనే రాజీనామా చేశా - రాజీనామా కాపీని జేబులో పెట్టుకుని తిరుగుతున్నా - మంత్రి తలసాని వెల్లడి హైదరాబాద్: ‘గత డిసెంబర్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా.. ఆ కాపీని జేబులోనే పెట్టుకుని తిరుగుతున్నా... ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి రెడీగా ఉన్నా’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలోని ‘డి’ బ్లాక్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాపీని ఆయన విలేకరులకు చూపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నానని, భయపడే వాడినే అయితే ఎమ్మెల్సీ పదవి అడిగి ఉండేవాడినని తలసాని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానని, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇందుకు సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని టీడీపీ, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను.. అందరి బండారం బయటపెడతా.. భూములు కొట్టేసిన దొంగలా నా గురించి మాట్లాడేది. ఒకసారి మీ చరిత్ర తెలుసుకోండి’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నరసింహులును టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారని, ఆయనపై ఏం యాక్షన్ తీసుకున్నారని ప్రశ్నించారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతలను టీడీపీలో చేర్చుకోలేదా? అని నిలదీశారు. ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, జూపూడి ప్రభాకర్, చైతన్య వర్మ, తిప్పేస్వామి ఇప్పుడు టీడీపీలో లేరా? అన్నారు. నాపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసే ముందు వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరి ఉంటే బాగుండేది. ఆ పార్టీకి అక్కడో నీతి, ఇక్కడో నీతా?’ అంటూ తలసాని మండిపడ్డారు. గండ్ర వెంకటరమణారెడ్డి ముందుగా ఆయన చరిత్ర తెలుసుకోవాలన్నారు. వైఎస్ వద్దకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు నాడు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని ఆరోపించారు. ఇలాంటి నాయకులు ఈ రోజు నీతులు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలనే టీఆర్ఎస్లో చేరానని, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తారని తలసాని పేర్కొన్నారు. -
తలసాని.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్మల్ రూరల్: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యవహారం ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరిన ఆయన తనకు ఓట్లేసిన ప్రజలనూ మోసం చేశాడని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పి, మంత్రి పదవి చేపట్టిన ఆయనను గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఇలాంటి వాటిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఆదిలాబాద్‌లోనూ ఉప ఎన్నికలు తప్పవని, పరోక్షంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్పలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకు ముందు నిర్మల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్‌ర్యాలీతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సీనియర్ నాయకులు సి.రాంచంద్రయ్య, నారాయణరావు పటేల్ తదితరులు ఉన్నారు. -
మంత్రిగా ‘తలసాని’ని అంగీకరించలేం...
టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. టీఆర్ఎస్ మంత్రిగా ఎలా జవాబిస్తారు మండలిలో కాంగ్రెస్, టీడీపీ సభ్యుల నిరసన.. వాకౌట్ హైదరాబాద్: ‘‘మంత్రిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ని అంగీకరించలేం.. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. టీఆర్ఎస్ మంత్రి గా ఆయన ఎలా జవాబిస్తారు’’ అని శాసనమండలిలో కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ప్రశ్నిం చారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వాణిజ్య పన్నుల వసూలు విషయమై కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి తలసాని జవాబిచ్చేందుకు లేవగా టీడీపీ సభ్యులు అభ్యం తరం తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని.. తన రాజీనామాను ఆమోదింపజేసుకోనందున ఆయనను తాము మంత్రిగా పరిగణించలేమని టీడీపీ సభ్యులు అరికెల నర్సారెడ్డి, పోట్ల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. తలసాని తమకు మంచి మిత్రుడైనా టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన్ను.. టీఆర్ఎస్ మంత్రిగా తాము పరిగణించలేమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ అన్నారు. అయినా మంత్రి జవాబిచ్చేందుకు నిలబడడంతో.. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు.. రాష్ట్రంలో మొత్తం 17,163 రేషన్ షాపులు ఉండగా, ఇందులో 896 షాపులకు డీలర్లను నియమించాల్సి ఉందని మంత్రి ఈటెల రాజేం దర్ అన్నారు. రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కాగానే రేషనలైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్‌ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రెండో అధికార భాషగా ఉర్దూ.. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తున్నారా.. అని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈటెల బదులిస్తూ.. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేయాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలను జారీ చేశామన్నారు. మండలిలో ‘గాజుల’ దుమారం సీలేరు ప్రాజెక్టు నుంచి విద్యుత్ వాటాను తెచ్చుకునే విషయమై ఎమ్మెల్సీ పొంగులేటి అడిగిన ప్రశ్న.. సభలో దుమారం రేపింది. మంత్రి హరీశ్‌రావు బదులిస్తూ సీలేరు, కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాకు ఏపీ సీఎం అడ్డుపడుతున్నారని చెప్పారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి మాట్లాడుతూ.. విభజన బిల్లులో ఈ అంశాలన్నీ పొందుపర్చి ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని హరీశ్‌రావును ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రావాల్సిన విద్యుత్‌ను పక్క రాష్ట్రం కొల్లగొడుతుంటే.. మంత్రులు గాజులు తొడుక్కున్నారా అని ప్రశ్నించారు. గాజులు తొడుకున్నారా అని నర్సారెడ్డి ప్రస్తావించడాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ తప్పుపట్టారు. -
తలసాని దారెటు.. ?
హైదరాబాద్: పండుగ.. ఫంక్షన్.. ఊరేగింపు.. ఇలా కార్యక్రమం ఏదైనా సరే.. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనదైన శైలితో రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ గందరగోళం రేపుతున్నారు. కొంత కాలంగా టీడీపీ సైకిల్ వీడి.. టీఆర్ఎస్ కారెక్కుతారనే ప్రచారం జరుగుతుండగా, ఆయన వ్యవహార శైలి సైతం అందుకు అనుగుణంగానే ఉంటోంది. టీడీపీలో సీనియర్ నాయకునిగా, హైదరాబాద్ జిల్లా పా ర్టీ అధ్యక్షునిగా ఉన్న ఆయన టీఆర్ఎస్తోనూ అంతే సఖ్యతతో ఉండడం అయోమయానికి గురిచేస్తోంది. దసరా రోజున తమ కుమార్తె శ్వేత వివాహ నిశ్చయ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబును, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నూ ఆహ్వానించడంతో ఇద్దరూ హాజరయ్యారు. ఇలాంటి ఘటనలే గతంలోనూ చోటు చేసుకున్నాయి. ఐడీహెచ్ కాలనీలో పేదల ఇళ్ల కోసమని నెలరోజుల క్రితం చంద్రశేఖర్‌రావును అక్కడకు రప్పించారు. ఆ హామీ మేరకు దసరా రోజున సదరు ఇళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. టీడీపీలో తాను కోరుకున్న పార్టీ శాసనసభాపక్ష నేత పదవి దక్కనప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారుతోంది. టీడీపీ- టీఆర్ఎస్ రెండు పార్టీలతోనూ సమదూరం పాటిస్తున్నారు. రెండు పడవల వైఖరి చివరకు ఏమజిలీకి చేరుతుందో అర్థం కాక పలువురు వేచి చూస్తున్నారు. కేసీఆర్‌తో గతంలో ఉన్న సాన్నిహిత్యం.. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదనే అంచనాలు.. తదితర పరిణామాలతో తలసాని టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నప్పటికీ.. ఆ విషయాన్ని స్పష్టం చేయకుండా.. కాదని ఖండిం చకుండా.. వ్యవహారాన్ని నడుపుకొస్తున్నారు. కాగా, టీఆర్ఎస్ ప్లీనరీ లోగా తలసాని టీఆర్ఎస్లో చేరేదీ, లేనిదీ స్పష్టం కానుందని రాజ కీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
పేదలకు ఉచితంగా 400 ఫ్లాట్లు!
శిథిలావస్థకు చేరిన ఇళ్ల స్థానంలో నిర్మించి ఇవ్వనున్న టీ సర్కారు హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో జీ+2 అపార్ట్మెంట్లుగా నిర్మాణం మూడో తేదీన సీఎం శంకుస్థాపన హైదరాబాద్: హైదరాబాద్‌లో శిథిలావస్థకు చేరిన ఇళ్ల స్థలంలోనే తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఫ్లాట్లను నిర్మించి ఇవ్వనుంది. దీనిపై గతంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 37 కోట్లను మంజూ రు చేస్తూ ఫైలుపై సోమవారం సంతకం చేశారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన నియోజకవర్గంలోని పేదలను ఇటీవల ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం అక్కడిక్కడే కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ఐడీహెచ్ కాలనీ, అంబూగూడ, సుభాష్ చంద్రబోస్ కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, పార్థీవాడల్లోని నిరుపేదలైన దాదాపు 400 మందికి.. ఒక్కో ఫ్లాట్‌ను 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి అందజేయనున్నారు. వీటిని జి+2 అపార్ట్మెంట్లుగా నిర్మిస్తారు. విజయదశమి రోజున సీఎం కేసీఆర్ వీటికి శంకుస్థాపన చేయనున్నారు. దళితులకు ఎస్సీ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. మైనారిటీలు, బీసీలకు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫైలు వచ్చిన గంటలోపే సీఎం సంతకం చేసి పంపించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం తలసాని సీఎంను కలిసి వెళ్లడం.. ఈ ఫైలును పెండింగ్‌లో పెట్టకుండా సీఎం వెంటనే ఆమోదించడం గమనార్హం. కుమార్తె పెళ్లి నిశ్చితార్థం కోసం.. సీఎం కేసీఆర్‌ను తన కుమార్తె వివాహ నిశ్చితార్థానికి ఆహ్వానించడం కోసం కలిశానని టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. తలసాని సోమవారం ఉదయం కేసీఆర్‌ను కలిశారు. ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కేసీఆర్‌ను కలవడానికి రాజకీయ కారణాలేమీ లేవని తలసాని చెప్పారు. 3వ తేదీన తన కుమార్తె వివాహా నిశ్చితార్థం ఉందని, కార్యాక్రమానికి కేసీఆర్‌తోపాటు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కూడా ఆహ్వానించానని తెలిపారు. -
మృతుల కుటుంబాలకు లక్ష సాయం: బాబు
హైదరాబాద్: మాసాయిపేట రైల్వే ఘటనలో మరణించిన, గాయపడిని వారి కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.లక్ష, గాయపడిన వారికి రూ.50వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను, బాధిత కుటుంబాలను ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సాయన్న, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణలతో కలిసి ఆయన పరామర్శించారు.