టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. టీఆర్‌ఎస్ మంత్రిగా ఎలా జవాబిస్తారు
మండలిలో కాంగ్రెస్, టీడీపీ సభ్యుల నిరసన.. వాకౌట్
హైదరాబాద్: ‘‘మంత్రిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ని అంగీకరించలేం.. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. టీఆర్‌ఎస్ మంత్రి గా ఆయన ఎలా జవాబిస్తారు’’ అని శాసనమండలిలో కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ప్రశ్నిం చారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వాణిజ్య పన్నుల వసూలు విషయమై కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి తలసాని జవాబిచ్చేందుకు లేవగా టీడీపీ సభ్యులు అభ్యం తరం తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని.. తన రాజీనామాను ఆమోదింపజేసుకోనందున ఆయనను తాము మంత్రిగా పరిగణించలేమని టీడీపీ సభ్యులు అరికెల నర్సారెడ్డి, పోట్ల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. తలసాని తమకు మంచి మిత్రుడైనా టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన్ను.. టీఆర్‌ఎస్ మంత్రిగా తాము పరిగణించలేమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ అన్నారు. అయినా మంత్రి జవాబిచ్చేందుకు నిలబడడంతో.. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు.
రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు..
రాష్ట్రంలో మొత్తం 17,163 రేషన్ షాపులు ఉండగా, ఇందులో 896 షాపులకు డీలర్లను నియమించాల్సి ఉందని మంత్రి ఈటెల రాజేం దర్ అన్నారు. రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కాగానే రేషనలైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్‌ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
రెండో అధికార భాషగా ఉర్దూ..
రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తున్నారా.. అని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈటెల బదులిస్తూ.. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేయాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలను జారీ చేశామన్నారు.
మండలిలో ‘గాజుల’ దుమారం
సీలేరు ప్రాజెక్టు నుంచి విద్యుత్ వాటాను తెచ్చుకునే విషయమై ఎమ్మెల్సీ పొంగులేటి అడిగిన ప్రశ్న.. సభలో దుమారం రేపింది. మంత్రి హరీశ్‌రావు బదులిస్తూ సీలేరు, కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాకు ఏపీ సీఎం అడ్డుపడుతున్నారని చెప్పారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి మాట్లాడుతూ.. విభజన బిల్లులో ఈ అంశాలన్నీ పొందుపర్చి ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని హరీశ్‌రావును ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రావాల్సిన విద్యుత్‌ను పక్క రాష్ట్రం కొల్లగొడుతుంటే.. మంత్రులు గాజులు తొడుక్కున్నారా అని ప్రశ్నించారు. గాజులు తొడుకున్నారా అని నర్సారెడ్డి ప్రస్తావించడాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ తప్పుపట్టారు.
మంత్రిగా ‘తలసాని’ని అంగీకరించలేం...
Published Wed, Mar 11 2015 2:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement