నజీర్‌భేగ్‌పల్లె(చెన్నూరు) : గుర్రంపాడు పంచాయతీకి చెందిన వీరబోయిన వెంకటసుబ్బయ్య(80) పెన్నా నదిలో పడి మృతి చెందినట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. ఆ వృద్ధుడికి మతి స్థిమితం లేదని, 10 రోజులుగా కనిపించకపోవడంతో పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. శనివారం నజీర్‌భేగ్‌పల్లె దళితవాడ ప్రజలు పెన్నా సమీపంలోకి వెళ్లగా.. నదిలోని కంప చెట్ల మధ్యన మృతదేహం ఉండటంతో బయటకు తీసుకొచ్చి ఖననం చేశారని వివరించారు.