అల్వాల్‌లో కాల్పుల కలకలం | The fire caused Sensation in alval | Sakshi
Sakshi News home page

అల్వాల్‌లో కాల్పుల కలకలం

Published Fri, Aug 12 2016 6:32 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

The fire caused Sensation in alval

నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి రెండు వర్గాలకు చెందిన వారి మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మచ్చబొల్లారంలో గురువారం రాత్రి ఓ కారులో వచ్చిన నలుగురు వ్యక్తుల మధ్య ఏదో గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి గన్‌తో ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. శబ్ధం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఓ వాడిన బుల్లెట్(ఖాళీ కేస్)ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ జరిగిన అనంతరం ఈ ఘటన వెలుగుచూడటంతో.. ఇందులో అతని అనుచరులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement