హోంమంత్రి చినరాజప్ప
సాక్షి, విజయవాడ బ్యూరో: ముద్రగడ పద్మనాభం పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోలేదని హోమంత్రి చినరాజప్ప చెప్పారు. తుని ఘటనలో అరెస్టయిన వారిని విడుదల చేయిస్తామని, వారిపై కేసులు ఎత్తివేస్తామనే హామీ తాము ఇవ్వలేదన్నారు. అరెస్టులు కోర్టు పరిధిలో ఉన్న అంశమని, ఆ విషయంలో తాము జోక్యం చేసుకోబోమన్నారు.
బుధవారం రాత్రి సీఎం కార్యాలయం వద్ద మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ దీక్ష విరమణ పట్ల ఆయన కుమారుడు బాలు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.వాటిని ఖండిస్తున్నామన్నారు. తుని ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని, అమాయకులను వేధించేది లేదనేదే తాము ఒప్పుకున్నామని చెప్పారు. ఫ్లూయిడ్స్ ఎక్కించిన నేపథ్యంలో ఆయన దీక్ష విరమించినట్లేనని చెప్పారు.
ముద్రగడ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోలేదు
Published Thu, Jun 16 2016 2:55 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM
Advertisement
Advertisement