మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
వెంకటాపురం : ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని వరంగల్ రేంజి డీఐజీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. హరితహా రంలో భాగంగా శని వారం మండలంలోని రామప్ప ఆలయ గార్డెన్‌లో ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వరంగల్ రేంజి పరిధిలో కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో 50లక్షల మొ క్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు. అనంతరం రామప్ప ఆలయంలోని రామలింగేశ్వరస్వామికి డీఐజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ములుగు సీఐ శ్రీనివాస్‌రావు, వెంకటాపురం ఎస్సై భూక్య రవికుమార్ ఉన్నారు.