సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ బకాయిలు, నెల జీతాలు... ఇతర ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వలేని ఆర్టీసీ మరోసారి భారీ అప్పు కోసం సిద్ధమైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.500 కోట్ల రుణం తెచ్చుకునేందుకు రోడ్డు రవాణాసంస్థ బ్యాంకు తలుపు తట్టబోతోంది. దీనికి అనుమతి ఇస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. ఇటీవల జరిగిన వేతన సవరణకు సంబంధించి కార్మికులు, సిబ్బందికి పాత బకాయిలు చెల్లించాల్సి ఉంది. తన వద్ద చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో వేతన సవరణకు అంగీకరించిన ప్రభుత్వమే ఆ బకాయిలు తీరుస్తుందని ఆర్టీసీ అప్పుడు భావించింది. కానీ ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఆదుకోవాలంటూ అభ్యర్థించింది.
దీంతో బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుని చెల్లించాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది. కానీ ఇప్పటికే అప్పులు, నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా లేకపోవడంతో తాను గ్యారంటీగా ఉంటానని ప్రభుత్వం హామీ ఇస్తూ ఉత్తర్వు జారీ చేసింది.
ఆర్టీసీ అప్పు... ప్రభుత్వ గ్యారంటీ
Published Tue, Oct 20 2015 4:56 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM
Advertisement