పథకం పూర్తిస్థాయిలో అందేలా చూడాలి
Published Thu, Aug 8 2013 3:04 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
నర్సంపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం లక్షలాది రూపాయులు ఖర్చు చేస్తూ సాగు నీటి కొరత తీర్చడానికి తలపెట్టిన బిందుసేద్యం(డ్రిప్) పథకాన్ని రైతులకు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని కలెక్టర్ కిషన్ అధికారులను ఆదేశించారు. వుండలంలోని చంద్రయ్యుపల్లి, బాంజీపేట గ్రావూల్లో ఇరిగేష న్ పనితీరును బుధవారం ఆయున పరిశీలించా రు. ఈ సందర్భంగా గ్రావు శివారులో ఉన్న పొ లం గట్ల మీద నడు స్తూ బావుల వద్దకు వెళ్లి బిం దు సేద్యం పని తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. బిందుసేద్యం పరికరాలు అన్ని అందాయూ.. లేదా.. ఏమైనా డబ్బులు చెల్లించా రా తదితర విషయూలను అడిగి తెలుసుకున్నారు.
చంద్రయ్యుపల్లి గ్రావూనికి చెందిన దుర్గల సూరయ్యు, దుర్గల పైడిలకు వుంజూరైన డ్రిప్ ఇరిగేషన్‌ను ట్రయుల్ రన్ చేయించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వం సబ్సిడీ రూపంగా అందించే డ్రిప్ ఇరిగేషన్ పథకం తవుకు వర్తించడం లేదని చంద్రయ్యుపల్లి గ్రావూనికి చెందిన రైతులు బాషబోయిన రాజు, ఎల్లస్వామి, సాంబరెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ సంబంధిత ఆర్డీఓకు సూచనలు ఇచ్చారు. బిందుసేద్యం పథకంలో అవకతవకలు జరి గితే చర్యలు తీసుకుంటావుని హెచ్చరించారు. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం పూర్తి స్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్టీ, ఎస్సీ రైతులకు పూర్తి శాతం సబ్సిడీ వర్తిస్తుందని, రైతులు దీ నిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రవుంలో ఆర్డీఓ అరుణకువూరి, తహసీల్దార్ రజి నీ, సునీత, ఆర్‌ఐ రాజు, ప్రసాద్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి
మడికొండ : విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని చదువాలని కలెక్టర్ కిషన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం మడికొండలోని కేంద్రీ విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయంలో జరిగే అడ్మిషన్ల ప్రక్రియ, కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్ నిర్మాణం గురించి ప్రిన్సిపాల్ అనుముల సిద్దా రాములును అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ కిషన్ మాట్లాడు తూ విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement