తవ్వకాల్లో బయటపడిన విగ్రహం
రహీమ్‌ఖాన్‌గూడెం (బీబీనగర్) : మండలంలోని రహీమ్‌ఖాన్‌గూడెంలోని ప్రాచీన దేవాలయం అయిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం తవ్వకాలు జరుపుతుండగా జగన్నాథస్వామి ఆకారంలో గల విగ్రహం బయటపడింది. ఆలయ పూజారి నడివాడ వెంకటనర్సింహాచారి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ ప్రాంగణంలోని సుబ్రమణ్యేశ్వరస్వామిని ప్రతిష్ఠించేందుకు గద్దె నిర్మాణం చేయడం కోసం తవ్వకాలు జరిపామని, ఈ క్రమంలో జగన్నాథస్వామి ఆకారంలో గల సుద్ద మట్టితో తయారు చేసి ఉన్న ఐదు ఇంచుల విగ్రహం బయటపడిందని తలిపారు. ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న ఆలయం కావడం, భూమిలో విగ్రహం లభ్యం కావడంతో గ్రామస్తులు ఆలయానికి చేరుకుని చూసి వెళ్తున్నారు.