of the
-
జ్ఞాన తెలంగాణ నిర్మాణం జరగాలి
పుస్తక ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ ఖమ్మం: నీళ్లు, నిధులు, కొలువుల కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణను జ్ఞాన తెలంగాణగా నిర్మించుకుంటేనే దేశంలోని ఇతర ప్రాంతాలకంటే అన్ని రంగాల్లో ముందుంటామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, ప్రముఖ కవి జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఖమ్మం నగరంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్‌తో కలిసి మాట్లాడారు. తెలంగాణలోని ప్రముఖ ప్రదేశాలు, చారిత్రక నేపథ్యం, కవులు, రచయితలు, త్యాగమూర్తుల చరిత్రలను వెలికితీసే నా«ధుడే కరువయ్యాడన్నారు. దాశరథి, జమలాపురం కేశవరావు, చందాల కేశవదాసు మొదలైన కవులకు నేటికీ గుర్తింపు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాషా పరిరక్షణ, వారసత్వాన్ని నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో పుస్తక ప్రదర్శనలు చేస్తున్నామన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఖమ్మం నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. పుస్తక పఠనం ద్వారా తెలంగాణ సబ్బండ జాతి సాహితీ అధ్యయనం వైపు మళ్లడం శుభసూచికమన్నారు. ఖమ్మంలో నిర్వహించే పుస్తక ప్రదర్శనకు నిర్వహణ కమిటీ అ«ధ్యక్షుడిగా మువ్వా శ్రీనివాసరావు, కార్యదర్శిగా రవిమారుతి, సహాయ కార్యదర్శిగా కేఎస్.రామారావు, జాయింట్ సెక్రటరీగా ఆనందాచారి, ఆర్గనైజేషన్ కార్యదర్శులుగా కవి సీతారాం, ప్రసేన్‌లను నియమించామని చెప్పారు. జిల్లా ప్రజలు పుస్తక ప్రదర్శనకు తరలివచ్చి ఆదరించాలని కోరారు. -
తవ్వకాల్లో బయటపడిన విగ్రహం
రహీమ్‌ఖాన్‌గూడెం (బీబీనగర్) : మండలంలోని రహీమ్‌ఖాన్‌గూడెంలోని ప్రాచీన దేవాలయం అయిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం తవ్వకాలు జరుపుతుండగా జగన్నాథస్వామి ఆకారంలో గల విగ్రహం బయటపడింది. ఆలయ పూజారి నడివాడ వెంకటనర్సింహాచారి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ ప్రాంగణంలోని సుబ్రమణ్యేశ్వరస్వామిని ప్రతిష్ఠించేందుకు గద్దె నిర్మాణం చేయడం కోసం తవ్వకాలు జరిపామని, ఈ క్రమంలో జగన్నాథస్వామి ఆకారంలో గల సుద్ద మట్టితో తయారు చేసి ఉన్న ఐదు ఇంచుల విగ్రహం బయటపడిందని తలిపారు. ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న ఆలయం కావడం, భూమిలో విగ్రహం లభ్యం కావడంతో గ్రామస్తులు ఆలయానికి చేరుకుని చూసి వెళ్తున్నారు. -
సృష్టిలో వివాహ వ్యవస్థ గొప్పది
స్త్రీ అమ్మవారి ప్రతిరూపం స్త్రీలు కోపానికి దూరంగా ఉండాలి భగవాన్ రాÐ]lుదూతస్వామి ఖమ్మం: సృష్టిలోని అన్ని వ్యవస్థల కంటే వివాహ వ్యవస్థ గొప్పదని,దీనికి విశిష్ట స్థానముందని భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామి అన్నారు. గురువారం ఆయన ఖమ్మం నగరంలోని బుర్హాన్‌పురంలో ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి) నివాసంలో సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం నిర్వహించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ వివాహ వ్యవస ్థద్వారా ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉండటంతోపాటు ఆనందాన్ని,వంశ వృద్ధిని కలిగించడమే కాకుండా మోక్షం కూడా లభిస్తుందన్నారు. స్త్రీ సహనమూర్తి అని ఆమె అమ్మవారి ప్రతిరూపమన్నారు. స్త్రీకి కోసం వస్తే శనీశ్వరుడు ఇంట ప్రవేశిస్తాడని,దీనివల్ల ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్త్రీమూర్తులు కోపానికి దూరంగా ఉండాలని సూచించారు. మనం చేసే ప్రతి పనికి దైవ కృప ఉంటే ఆ పని విఫలం కాదన్నారు. ప్రతి ఒక్కరూ మంచి జరిగేందుకు సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం చేయించుకోవాలన్నారు.ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ భగవాన్ రామదూత స్వామి తమ నివాసానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా స్వామి దర్శనం ఆనందంగా ఉందన్నారు. స్వామీజీని వద్దిరాజు రవిచంద్ర సోదరులు,ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, స్థానిక కార్పొరేటర్ శీలంశెట్టి రమ, వీరభద్రం, ఆర్జేసీ కృష్ణ, శెట్టి రంగారావు కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం సిటీ : ఇల్లెందు ఏరియాలో పోడు భూముల్లో పంటల విధ్వంసం, ఆదివాసీలపై పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. తొలుత ఆ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలు దేరి బైపాస్ రోడ్డు వరకు చేరుకుని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కెచ్చెల రంగయ్య మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో ఆదివాసీల పంటలను ధ్వంసం చేస్తోందని విమర్శించారు. అడ్డు వచ్చిన మహిళలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి వారికి పట్టాలివ్వాలని ప్రభుత్నాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య పాల్గొన్నారు. -
ఇక.. ఉద్యమాలకే అంకితం
ఉద్యోగ సంకెళ్ల నుంచి బయటపడ్డాను కన్నకొడుకు కన్నా కార్మిక హక్కులకే ప్రాధాన్యం యాజమాన్యం దాషీ్టకానికి ఏనాడూ జంకలేదు ‘సాక్షి’తో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ ౖయెటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : ఉద్యోగం అనే సంకెళ్ల నుంచి బయటపడ్డాను.. మలి జీవితాన్ని కార్మికవర్గ ఆత్మగౌరవ పోరాట ఉద్యమానికే అంకితం చేస్తా.. అని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ అన్నారు. ఓసీపీ–3 ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌గా ఉద్యోగ విరమణ పొందిన ఆయన తన మనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు రియాజ్ మాటల్లోనే.. నెలకు రూ.60 జీతంతో మొదలు పెద్దపల్లిలో ఐటీఐ చేస్తున్నపుడు క్యాంపస్ సెలక్షన్లో సింగరేణి ఉద్యోగం వచ్చింది. 1975లో వీకే–7 గనిలో క్యాప్టివ్ ట్రెయినీగా నెలకు రూ.60 జీతంతో చేరాను. రామగుండం ఏరియా వర్క్‌షాప్‌లో అంప్రెంటిస్గా వచ్చింది. ఇంజినీర్ల దాదాగిరికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో 1977లో జీడీకే–2ఏ గనికి బదిలీ చేశారు. ట్రెయినీగా ఉండి సమ్మెలోకి వెళ్లడంతో డ్యూటీకి రావాలని బెదిరించినా వినకపోతే చార్జిషీట్ ఇచ్చారు. అప్పుటి నుంచే ఈ పర్వం మొదలైంది. సమస్యల నుంచి పుట్టిన యూనియన్ 1977లో ఇంజనీర్ల ఆగడాలకు వ్యతిరేకంగా, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా 1500 మంది టెక్నీషియన్లను ఒక్కతాటిపై చేర్చి సింగరేణిలో ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేశా. 1978లో హెచ్ఎంఎస్ యూనియన్‌కు అనుబంధం చేశాం. క్రాఫ్ట్ సంఘంగా ముద్రవేసి మిగితా సంఘాల నాయకులు మమ్ముల్ని యాజమాన్యంతో మాట్లాడనీయలేదు. 1985లో 12 మంది ఎమ్మెల్యేలతో మహాసభ పెట్టి నాయిని నర్సింహారెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. అప్పుడే సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్‌గా ఆవిర్భవించింది. హక్కులకే ప్రాధాన్యం ఓపెన్‌కాస్ట్ కార్మికులకు ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని కోరుతూ అమరణ నిరాహాదీక్ష చేస్తున్న క్రమంలో యాజమాన్యం విచ్ఛిన్నం చేయాలని చూసింది. రెండు రోజుల అమరణ దీక్ష తర్వాత ఏడాది వయసు బాబు నీటి ట్యాంకులో పడి మృతి చెందాడు. అయినా దీక్ష విరమించకుండా కార్మికుల హక్కులకే ప్రాధాన్యమిచ్చా. చివరకు నా కొడుకు మృతదేహాన్ని దీక్షా శిబిరం వద్దకు తీసుకువచ్చి చూపించి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత మరో ఐదురోజులు అమరణ దీక్ష కొనసాగించా. అరెస్ట్ చేసి కొత్తగూడెం ఆస్పత్రిలో పెడితే తప్పించుకుని వచ్చి ఆందోళనలు నిర్వహించాను. యాజమాన్యం దిగివిచ్చ భారీ యంత్రాల్లో పనిచేసే జనరల్ మజ్దూర్లకు ప్రమోషన్ పాలసీ అమలు చేయడానికి ఒప్పుకుంది. చార్జిషీట్లు.. వార్నింగ్ లెటర్లు.. సస్పెన్షన్ సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏనాడూ వెనకడగు వేయలేదు. అధికారుల పెత్తందారు పోకడల్ని ప్రశ్నించినందుకు ఉద్యో గ కాలంలో యాజమాన్యం నాకిచ్చిన బహుమతులు 27 చార్జిషీట్లు, 78 వార్నింగ్ లెటర్లు, 365 రోజలపాటు సస్పెన్షన్. అయినా వెరవకుండా పోరాటం చేశా. కార్మికుల ఆత్మగౌరవమే ధ్యేయం సింగరేణి ఉద్యోగ విరమణతో సంకెళ్లు తెగిపోయాయి. ఉద్యోగిగా పనిచేస్తున్న క్రమంలో అనేక విధాలుగా యాజమాన్యం బ్లాక్మెయిల్ చేసింది. ఇక అన్నిటికీ పుల్‌స్టాఫ్ పడింది. పోయిన వారసత్వ ఉద్యోగాలు, క్యాడర్‌స్కీం అమలు, ప్రమోషన్ పాలసీ, డిజిగ్నేషన్ మార్పు తదితర హక్కుల సాధనకు పోరాడుతాను. మలి జీవితాన్ని కార్మికుల కోసం అంకితం చేస్తా. సంస్థ పురోభివృద్ధిలో భాగస్వామ్యం కేవలం కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా కాకుండా తెలంగాణకు కొంగుబంగారంగా ఉన్న సింగరేణి సంస్థను కాపాడుకుంటాం. గనులు మూతపడకుండా చూసి ఉద్యోగాలను కాపాడుకుంటాం. హెచ్ఎంఎస్ను గుర్తింపు సంఘంగా నిలబెట్టడమే నా లక్ష్యం. -
రీడిజైన్ పేరుతో ప్రభుత్వ దోపిడీ
ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఒక రోజు దీక్ష విరమణ సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం: ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను దోచుకుంటోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పేర్లను ప్రభుత్వం మార్చడాన్ని; రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం ఖమ్మంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దీనిని ఉదయం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితం సత్యం ప్రారంభించగా, సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో భట్టి మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగులక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను వైఎస్సార్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అప్పుడున్న డిజైన్ ప్రకారం శబరి నది నీటితోపాటు కిన్నెరసాని మిగులు జలాలు, పోలవరం బ్యాక్ వాటర్‌ను జిల్లా బీడు భూములకు తరలించే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్టర్ల డబ్బుకు కక్కుర్తిపడిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. రీడిజైన్‌తోపాటు ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్, చేవెళ్ల, ప్రాణహిత (బాబాసాహెబ్ అంబేడ్కర్) పేర్లను మారుస్తూ అదనంగా వేలకోట్ల రూపాయల ఖర్చుకు సిద్ధమైందని విమర్శించారు. ‘‘475 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 10వేల కోట్లు ఇవ్వడంలోని ఆంతర్యమేమిటి? ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వకుండా ఇన్ని వేలకోట్లు ఎలా ఖర్చు చేస్తారు?’’ అని ప్రశ్నించారు. 80 శాతం పనులు పూర్తయిన వాటిని నిరుపయోగంగా వదిలేసి, కొత్త పనులకు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. విభజనకు ముందు ప్రారంభించిన ప్రాజెక్టులను యథావిథిగా పూర్తిచేయాలని విభజన చట్టం సూచించిందన్నారు. రైతుల రుణాలను ఒకేసారి కాకుండా విడతలవారీగా మాఫీ చేస్తుండడంతో.. ఆ వచ్చినదంతా వడ్డీలకు కూడా చాలడం లేదని, పాత బకాయిల పేరుతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, ఆందోళనకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ పేర్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పేర్లు మారిస్తే ఆందోళన చేస్తామన్నారు. మాజీ మంత్రులు వనమా వెంకటేశ్వరరావు, సంభాని చంద్రశేఖర్ కూడా మాట్లాడారు. దీక్ష శిబిరంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా మహిⶠకాంగ్రెస్ అధ్యక్షురాలు బండి మణి, యువజన కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి శ్రీచరణ్‌రెడ్డి, మనోహర్ నాయుడు, రాపర్తి శరత్, కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు జావీద్, ఖమ్మం కార్పొరేటర్లు వడ్డెబోయిన నరసింహారావు, బాలగంగాధర్ తిలక్, పార్టీ నాయకులు బెల్లం శ్రీను, సోమ చంద్రశేఖర్, ఫజల్, పాషా, పరంజ్యోతి, బాలాజీరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘కోట’ బోనాలు
గోల్కొండ, న్యూస్‌లైన్: డప్పుల చప్పుళ్లు... సంప్రదాయ నృత్యాలు... పోతరాజుల విన్యాసాలు... శివసతుల పూనకాలు... పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు... వెరసి గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాలు గురువారం ఘనంగా ముగిశాయి. అమ్మవారికి 9వ పూజ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభమై చివరగా ముగిసే గోల్కొండకోట బోనాలకు ఉన్న చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యా.. గురువారం జరిగిన పూజలకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గోల్కొండలోని నగీనాబాగ్తో పాటు ఇతర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడాయి. గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులు వంటలు చేసుకొని నైవేద్యం తీసుకొని తలలపై బోనాలతో కోటపై కొలువుదీరిన అమ్మవార్ల వద్దకు బయలుదేరారు. అమ్మవారి 9వ పూజ భాగంలో వృత్తి పనివారల సంఘం సభ్యులైన కుమ్మరి వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగీనాబ్యారక్స్లో వివిధ రకాల నైవేద్యాలతో పాటు సాకను తయారు చేశారు. అనంతరం వంటలు, నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించడానికి డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో కోటపైకి బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా పోతరాజుల విన్యాసాలు, శివసతుల పూనకాలతో కోటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చివరి పూజ రోజు బీజేపీ సీనియర్ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, లంగర్‌హౌస్ కార్పొరేటర్ ఉదయ్‌కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవర కరుణాకర్, సంఘ సేవకులు ఎస్.రాజు ఉస్తాద్, వృత్తిపనివార్ల సంఘం సలహాదారు కరణ్‌కుమార్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. పూజారులు అనంతచారి, బొమ్మల సాయిబాబాచారి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా గోల్కొండ తహసీల్దార్ చంద్రావతి తన సిబ్బందితో కలిసి కోటపై ఉన్న అమ్మవార్లను దర్శించుకున్నారు.