అనంతపురం అర్బన్: జిల్లాలో ప్రజాసాధికార సర్వే, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ నుంచి తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 43,27,844 మంది జనాభా ఉంటే ఇప్పటి వరకు 35,50,519 జనాభాను సర్వే చేశారన్నారు. సర్వే నిర్వహణకు జిల్లాకు రూ.2.48 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి అర్హులందర్నీ నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు పట్టభద్రులు 22,135 మంది, ఉపాధ్యాయులు 1,001 మంది నమోదు చేసుకున్నారన్నారు. ఇక మిగిలింది కేవలం ఐదు రోజులు మాత్రమేనని గుర్తు చే శారు.