విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్టేషన్‌లోని మూడో నంబరు ప్లాట్‌ఫాం వద్ద ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గుర్తించిన రైల్వే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. యువతి స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీ(22)గా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.