బంగారం పోయి.. దొరికింది ఇలా..
పెనుమాక (తాడేపల్లి రూరల్): పెనుమాకలో చోరీకి గురైన 21 సవర్ల బంగారం దొరికింది. అపహరించిన బంగారాన్ని దొంగ.. బాధితుడి ఇంటిపక్కనే పెట్టగా అది సోమవారం బయటపడింది. గ్రామానికి చెందిన బోనం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో 21 సవర్ల బంగారు ఆభరణాలు, 40 వేల నగదు ఇటీవల అపహరణకు గురయ్యాయి. మొదట 70 సవర్ల బంగారం పోయిందనుకున్న బాధితులకు ఇంటి సమీపంలోని నీళ్లడ్రమ్ములో కొంత, ముళ్ల పొదల్లో కొంత, మరి కొంత ఇంట్లోని బీరువాలోనే కనిపించింది.. మిగిలిన 21 సవర్ల బంగారం అపహరణకు గురైందని నిర్ధరించుకున్నారు.
సోమవారం ఉదయం బాధితుడు బోనం వెంకటేశ్వరరెడ్డి భార్య తమ ఇంటి పక్కనే ఉన్న నిర్మాణంలో వెతుకగా బంగారం భద్రపరిచిన బాక్సు ఖాళీ సిమెంటు సంచులపై దొరికింది. దాని తెరిచి చూడగా ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిన బంగారం కనిపిచింది. దీంతో భర్తను, చుట్టుపక్కల వారిని పిలిచి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి 21 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇంతకీ జరిగేందేమిటంటే..?
ఆదివారం తెల్లవారుజామున పోలీసులు వేలిముద్రలు సేకరించడం, డాగ్ స్వా్కడ్‌తో తనిఖీలు నిర్వహించారు. మరుసటి రోజు తాము అనుమానం ఉన్న వ్యక్తులను పోలీసుస్టేషన్‌కు పిలిపిస్తామంటూ గ్రామంలో హెచ్చరికలు చేశారు. దీంతో భయపడిన దొంగ మిగిలిన బంగారాన్ని కూడా బాధితులకు దొరికేలా పెట్టాడన్న మాట.