కదిరిలో చోరీ | theft in kadiri | Sakshi

కదిరిలో చోరీ

Oct 2 2016 12:32 AM | Updated on Sep 4 2017 3:48 PM

కదిరిలోని రాయచోటి రోడ్డులో గల సమీవుల్లా ఇంట్లో చోరీ జరిగింది.

కదిరి టౌన్‌ : కదిరిలోని రాయచోటి రోడ్డులో గల సమీవుల్లా ఇంట్లో చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సమీవుల్లా కుటుంబ సభ్యులతో కలసి గుంతకల్లు సమీపంలోని ఎల్లార్తి దర్గా దర్శనం కోసం శుక్రవారం ఇంటికి తాళం వేసి వెళ్లారు. దీన్ని పసిగట్టిన దొంగలు తాళాన్ని పగులగొట్టి బీరువాలోని ఎనిమిది తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.86 వేల నగదు ఎత్తుకెళ్లారు. దర్గా నుంచి తిరిగి ఇంటికి చేరుకొన్న వారు చోరీ జరిగినట్లు పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement