ఎల్‌ఎండీ క్యాంపు క్వార్టర్లలో రికార్డులు చోరీ | Theft in lmd qurters | Sakshi
Sakshi News home page

ఎల్‌ఎండీ క్యాంపు క్వార్టర్లలో రికార్డులు చోరీ

Published Wed, Aug 24 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

ఎల్‌ఎండీ క్యాంపులోని రెండు క్వార్టర్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎల్‌ఎండీలోని క్వార్టర్లు బీ 173, 172లను గతంలో శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సబ్‌ డివిజన్‌ 1, 2లకు కేటాయించారు.

తిమ్మాపూర్‌ : ఎల్‌ఎండీ క్యాంపులోని రెండు క్వార్టర్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎల్‌ఎండీలోని క్వార్టర్లు బీ 173, 172లను గతంలో శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సబ్‌ డివిజన్‌ 1, 2లకు కేటాయించారు. తర్వాత సబ్‌ డివిజన్లను ధర్మారం, చందుర్తికి తరలించగా.. ఆ క్వార్టర్లలో రికార్డులను భద్రపరచి, స్టోర్‌ రూమ్‌గా ఉపయోగిస్తున్నారు. రికార్డుల పరిశీలనకు అప్పుడప్పుడు ధర్మారం సబ్‌ డివిజన్‌ నుంచి సీనియర్‌ అసిస్టెంట్, చందుర్తి సబ్‌ డివిజన్‌ నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ వస్తూంటారు. మంగళవారం ధర్మారం సబ్‌ డివిజన్‌ రికార్డులున్న క్వార్టర్‌ బి–173 తాళం ధ్వంసం చేసి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చెక్క బీరువాలో రికార్డులను ఎత్తుకెళ్లారు. మూడు ఎంబీ రికార్డులు, ఇతర పత్రాలు, పరికరాలు కనిపించడం లేదని సీనియర్‌ అసిస్టెంట్‌ చెప్పారు. ఎల్‌ఎండీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement