ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ | theft on house | Sakshi
Sakshi News home page

ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ

Published Tue, Sep 20 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

theft on house

ఏలూరు అర్బన్‌  : ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు బీరువాలో దాచుకున్న బంగారు నగలు దోచుకుపోయారు. దీంతో బాధితులు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఎన్‌.రాంబాబు కథనం ప్రకారం.. జమ్ము కామనాయుడు వృత్తిరీత్యా చుట్టల వర్కర్‌. స్థానిక నల్లదిబ్బ, జండాచెట్టు సెంటర్‌లో భార్యాబిడ్డలతో కలిసి నివాసం ఉంటున్నాడు.

భార్యాభర్తలిద్దరూ ఆదివారం ఇంటికి తాళాలు వేసుకుని చుట్టల పనికి వెళ్లారు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఆదుర్దా పడుతూ ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువాలో దాచుకున్న రెండున్నర కాసుల బంగారునానుతాడు అపహరణకు గురైందని గుర్తించారు. దీంతో బాధితులు సోమవారం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఎన్‌.రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement