గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం వచ్చి.. | theif arrest in mahabubabad | Sakshi
Sakshi News home page

గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం వచ్చి..

Published Sat, Sep 24 2016 11:26 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

theif arrest in mahabubabad

  • వరుస చోరీలు..
  • మానుకోటలో దొంగతనాలకు పాల్పడిన
  • యువకుడి అరెస్ట్‌  
  • 16 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
  • నిందితుడు పాత నేరస్తుడే  
  • బాల్యం నుంచే చోరీల బాట
  • మహబూబాబాద్‌ : అతడో గజ దొంగ.. ఇంటికి కన్నం వేశాడంటే బీరువాలో ఉన్నదంతా దోచేయాల్సిందే. బాల్యం నుంచే చోరీల్లో ఆరితేరిన ఈ దొంగకు ఇటీవల మానుకోటకు చెందిన ఓ అమ్మాయి పరిచయం కావడంతో ఇక్కడి ఇళ్లపై అతడి కన్నుపడింది. ఆమెను కలిసేందుకని వచ్చిన అతడు ఇక్కడ కూడా తన చోరకâýæ ప్రదర్శించాడు. స్థానిక టౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒSలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.రాజమహేంద్ర నాయక్‌ చోరీ వివరాలను వెల్లడించారు. ఖమ్మంకు చెందిన బొల్లిశెట్టి శ్రీనివాస్‌ అలియాస్‌ బన్ను ప్రస్తుతం  సత్తుపల్లిలోని తన అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటుపడిన ఇతడు మైనర్‌గా ఉన్నప్పుడే మూడుసార్లు జైలుకు వెళ్లొచ్చాడు. అతడికి మానుకోటకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడడంతో తరచూ ఇక్కడికి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే అతడు పట్టణంలోని బుక్క బజార్‌కు చెందిన కొదుమూరి శివకుమార్‌ ఇంట్లో 12 తులాల బంగారు ఆభరణాలు(హారం, నక్లెస్, బ్రాస్‌లైట్, టైటా¯ŒS వాచ్, ఇతరత్ర), రాంచంద్రాపురం కాలనీలోని బానోత్‌ భీముడు ఇంట్లో 10 గ్రాముల(చెవుల కమ్మలు) బంగారం, బెస్తబజార్‌లోని డోలి అరుణ ఇంట్లో రెండు తులాల బంగారు ఆభరణాలను అపహరించాడు. ఈ క్రమంలో శనివారం అతడు మానుకోటలో మళ్లీ చోరీలకు పాల్పడేందుకు వస్తుండగా పట్టణ శివారులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం సమీపంలో టౌ¯ŒS సీఐ నందిరామ్‌ నాయక్, సిబ్బంది శనివారం వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని వి చారించగా చోరీల విషయం వెల్లడించాడు. ఆ ఆభరణాలను రైల్వే ఓవర్‌బ్రిడ్జి కిందలో గుంతలో దాచిపెట్టినట్లు అతడు చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించారు. కొత్తగూడెంలోని గురునాథం ఇంట్లో కూడా చోరీకి పాల్పడగా ఆ బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement