మమ్మల్ని బెదిరించి అక్రమించుకున్నారు
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం ఖిలానగర్‌లోని తమ సొంత స్థలం 1780 చదరపు గజాలను నయీమొద్దీన్ గ్యాంగ్ బెదిరించి రిజిస్టర్ చేయించుకున్న దానిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన వారాల శ్రీనివాస్ తండ్రి వెంకటయ్య, వారాల కృష్ణ తండ్రి వారాల వెంకటయ్య, వారాల అశోక్ తండ్రి వెంకటయ్యలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు వారిమాటల్లోనే.. మాకు భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న సర్వేనెంబర్ 8లో రూ. కోటి యాబైలక్షల విలువగల ఐదు మడిగెలు, మూడు ఆర్‌సీసీ రూములు, ఖాళీ స్థలము మొత్తం 1780 చదరపు గజాలు ఉందన్నారు. నయీమ్ అతని అనుచరులు పాశం శ్రీనివాస్, పెంట నర్సింహ, గొర్రెంకల శివశంకర్, కొంత మంది అనుచరులతో వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నించారన్నారు. అందుకు గాను నయీమ్ అనుచరులు పాశం శ్రీను, అతని అనుచరులు హైదరాబాద్ చంపాపేట్‌లో నివసిస్తున్న మా వద్దకు పలుమార్లు వచ్చి మా ఆస్తిని ఇవ్వమని లేకుంటే మమ్ములను మాకుటుంబ సభ్యులను చంపుతామని భయబ్రాంతులకు గురిచేశారన్నారు. రూ. కోటి 50 లక్షల విలువ గల ఆస్తిని కేవలం రూ.40 లక్షలు ఇచ్చి బలవంతంగా నయీమ్ తన తరుపు బంధువుల పేరుమీద 13 డాక్యుమెంట్లు తయారు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. మా విలువైన ఆస్తిని మాకు తిరిగి ఇప్పించాలలి. అలాగే మాకు నయీమ్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలి.