encroachment
-
హైదరాబాద్ పరిధిలో చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు పోటెత్తుతున్న ఫిర్యాదులు
-
గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములు స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం 36 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకోగా, గతంలో ప్రారంభించిన ప్రక్రియకు కొనసాగింపుగా తాజాగా సర్వే నంబర్ 15,16,19,20 పరిధిలోని 4.36 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్‌ను రెవెన్యూ సిబ్బంది వేయిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా గీతం వర్శిటీ అవసరాలకు ప్రభుత్వ భూములను వినియోగించుకుంటోంది. అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు -
400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్‌తో బెంగళూరు నిర్మాణం.. నేటి దుస్థితికి కారణాలేంటి?
చెరువుల నగరంగా ఒకప్పుడు పేరున్న బెంగళూరులో ఆ చెరువులు, వాటి అనుబంధ కాలువలు ప్రభుత్వ నిర్మాణాలకు, కబ్జాల వల్ల అదృశ్యమైపోయాయి. ఫలితంగా వర్షాలు వస్తే ఆ నీరు ఒకప్పుడు జల వనరులు ఉన్న చోటికే వెళ్తోంది. చివరికి ముంపు తయారవుతోంది. దీనివల్ల లక్షలాది జీవితాలు అవస్థల పాలయ్యాయి. బెంగళూరు: నాలుగు వందల ఏళ్ల కిందటే నాడప్రభు కెంపేగౌడ పకడ్బందీ ప్రణాళికతో నిర్మించిన చారిత్రక నగరం బెంగళూరు నేడు మామూలు వర్షానికే గజగజ వణికిపోవడం చూస్తే పరిస్థితి ఎంత దుర్భరంగా తయారైందో ఇట్టే అర్థమవుతుంది. నగరంలో పకడ్బందీగా ఉన్న రాజ కాలువలు వారూ వీరూ అని తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడి ఇళ్లు, భవనాలు కట్టేయడం, చెరువులను చదును చేసి లేఔట్లు నిర్మించడం వల్ల నైసర్గిక స్వరూపాలే మారిపోయి విపత్తులు పుట్టుకొస్తున్నాయి. ఉన్న చెరువులు, కాలువల్లో కూడా పూడిక పెరిగిపోయింది. వాతావరణ మార్పుల వల్ల ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడం మరో కారణం. వర్షపు నీరు రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి చొరబడటంతో ముంపు తలెత్తుతోంది. బెల్లందూరు చెరువు దుస్థితి బెంగళూరు నగరంలో చెరువుల స్థానంలో నిర్మించిన కట్టడాల వివరాలు ►శూలె చెరువులో ఇప్పుడు ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణమైంది. అక్కితిమ్మనహళ్లి చెరువు– హాకీ స్టేడియంగా, సంపంగి చెరువు –కంఠీరవ స్పోర్ట్ కాంప్లెక్సా్గ, ధర్మాంబుధి చెరువు–కెంపేగౌడ బస్టాండుగా, చల్లఘట్ట చెరువు–కర్ణాటక గోల్ఫ్ మైదానంగా మారిపోయాయి. ►కోరమంగల చెరువు– నేషనల్ గేమ్స్ కాంప్లెక్స్ మైదానం, సిద్దికట్టె చెరువు–కేఆర్.మార్కెట్‌గా, కారంజీ చెరువు–గాంధీ బజార్, కెంపాబుధి చెరువు–భూగర్భ డ్రైనేజీ సేకరణ ట్యాంక్‌గా మారిపోయాయి. ►నాగశెట్టిహళ్లి చెరువు– స్పేస్ డిపార్టుమెంట్, కాడుగొండనహళ్లి చెరువు–అంబేడ్కర్ మెడికల్ కాలేజీ, దుమ్మలూరు చెరువు–బీడీఏ లేఔట్, మిల్లర్స్ చెరువు–గురునానక్ భవన్ అయ్యాయి, ►సుభాష్ నగర చెరువు, కురబరహళ్లి చెరువు, కోడిహళ్లి చెరువు, సినీవాగిలు చెరువు, మారేనహళ్లి చెరువులు నేడు నివాస ప్రాంతాలుగా మారాయి. ►శివనహళ్లి చెరువు–క్రీడా మైదానం, బస్టాండుగా రూపాంతరం చెందాయి. ►చెన్నమనచెరువు –స్మశానం, పుట్టేనహళ్లి చెరువు– జేపీ నగర 6వ ఫేజ్, జక్కరాయనచెరువు – క్రీడా మైదానం అయ్యింది. మారతహళ్లిలో బోటులో వెళ్తున్న జనం నగరానికి ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు ప్రతి ఏడాది బెంగళూరు నగరాభివృద్ధి నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వరద ముంపు సమస్యను తప్పించడం సాధ్యం కావడం లేదు. బీబీఎంపీ బడ్జెట్ సుమారు రూ.11 వేల కోట్లు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరో రూ.10 వేల కోట్ల నిధులు లభిస్తాయి. ఇలా ప్రతి ఏడాది రూ. 20 వేల కోట్లను బెంగళూరుపై ఖర్చు చేసినప్పటికీ ప్రజల సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఒకనాటి పొలాలు, చిట్టడవులు మాయం ►అందుకే ఇంత ముప్పు! ప్రకృతిని కాపాడుకోకపోవడమే ఈ వరద ముంపునకు కారణమని పర్యావరణవాదులు పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షంతో జలమయమైన బెంగళూరులోని లేఔట్లు గతంలో పొలాలు, చెరువులు, అచ్చుకట్ట ప్రాంతాలు, చిట్ట అడవులతో కూడుకున్న ప్రదేశాలు. గత పది, ఇరవై ఏళ్లలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో భారీఎత్తున లేఔట్లు, కట్టడాలు, రోడ్లు నిర్మించారు. ఇప్పుడు కుండపోత వర్షాలకు చెరువుల్లా తయారయ్యాయి. ఏ ప్రాంతంలో ముందు చెరువు ఉండేది, ఎక్కడ రాజ కాలువ ఉండేది అనేదానిని ప్రస్తుత ముంపు చాటిచెబుతోందని పరిసరవాదులు అభిప్రాయపడ్డారు. రెయిన్ బో లేఔట్లో తీరని ముంపు కష్టం ప్రధానంగా బెల్లందూరు, వర్తూరు, విభూతిపుర, సావళచెరువు, బేగూరు చెరువు చుట్టుపక్కల లేఔట్లు ప్రస్తుతం భారీ వర్షాలతో జలంలో చిక్కుకున్నాయి. ఈ చెరువుల విస్తీర్ణం గత 40 ఏళ్లతో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. ఈ చెరువులకు వెళ్లే రాజ కాలువలపై కట్టడాలు వెలిశాయి. అక్రమ కట్టడాలను తొలగించాల్సిన ప్రభుత్వం సక్రమ పథకంతో అనుకూలం చేయడం ప్రకృతికి మంచి చేయదని పరిసరవాది యల్లప్పరెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
క్రమబద్ధీకరణతో అడవుల ఆక్రమణకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోడు క్రమబద్ధీకరణ పేరిట మళ్లీ అటవీ ఆక్రమణలకు అవకాశం ఇవ్వొద్దని పర్యావరణ నిపుణులు, జంతు ప్రేమికులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు సూచిస్తున్నారు. గతంలో చేసిన ఆక్రమణలను కొత్తగా క్రమబద్ధీకరిస్తామంటే అడ్డూ అదుపూ లేకుండా అటవీ విధ్వంసం జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరిట గత ఏడేళ్లుగా చేపట్టిన బృహత్ కార్యక్రమం ద్వారా సాధించిన మంచి ఫలితాలు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో పోడు సమస్య అధ్యయనానికి, క్షేత్ర స్థాయి వాస్తవాల సేకరణను అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు చేపడుతున్నారు. పోడు సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ వంటి ప్రధాన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 23న జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. సరైన దిశలో నిర్ణయాలు తీసుకోవాలి.. మొత్తంగా అటవీ ఆక్రమణలను పోడుగా పరిగణించకుండా, అటవీ భూమిని సాగుచేసే నిజమైన ఆదివాసీ గిరిజనులను గుర్తించాలి. ఏళ్లకొద్దీ సాగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించడం మంచిదే. అయితే ఈ దిశలో సర్కారు తీసుకునే నిర్ణయాలు అటవీ హక్కులు, అటవీ పరిరక్షణ చట్టాలు, భారత అటవీ చట్టం వంటి చట్టపరమైన సమీక్షకు నిలబడలేవు. అదీగాక పోడును క్రమబద్ధీకరిస్తామనే ప్రభుత్వ సంకేతాలతో అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయం చేస్తే వాటిపై ఎప్పటికైనా హక్కులు లభించొచ్చుననే దురాశతో ఇబ్బందులు తలెత్తుతాయి. హరితహారం పేరిట సాధించిన ఫలితాలు, ప్రయోజనాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. – ఇమ్రాన్ సిద్దిఖీ, జంతు ప్రేమికుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పోడు పేరిట విధ్వంసం.. ఆదివాసీలు, గిరిజన జనాభా లేని చోట్ల కూడా ఆదివాసీ చట్టాన్ని అమలు చేస్తామనడం సరికాదు. అడవిని విధ్వంసం చేసి గిరిజనేతరులకు కూడా పునరావాసం కల్పించాలనేది కూడా మంచిది కాదు. 2006లో కేంద్రం సవరించిన అటవీహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం.. పోడు, అటవీ ఆధారిత గిరిజన , ఆదివాసీలకు మాత్రమే మెరుగైన జీవితం కోసం కొంత పోడు చేసిన అటవీ ప్రాంతం విధ్వంసానికి గురికాకుండా చేయాలి. అందువల్ల పోడు అంశాన్ని మళ్లీ పునఃసమీక్షించడం సరికాదు. ఇది పూర్తిగా అశాస్త్రీయం. అటవీ చట్టమనేది పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలోనిది. రిజర్వ్ ఫారెస్ట్‌ను డీరిజర్వ్ చేయడానికి కూడా రాష్ట్రానికి అధికారం లేదు. 15 ఏళ్ల సుదీర్ఘకాలం దాటాక కూడా (2006లో కొత్త చట్టం అమల్లోకి వచ్చాక) పునర్ సమీక్షించి, 2000 చట్టాన్ని అమలు చేస్తామనడం సమర్థనీయం కాదు. వాస్తవానికి ఇప్పటిదాకా ఎంత మంది గిరిపుత్రుల కుటుంబాలకు ఎన్ని లక్షల ఎకరాల్లో పోడు పట్టాలిచ్చారు. పోడు పేరిట సహజసిద్ధమైన అటవీ వనరులకు నష్టం చేసే ప్రయత్నాలు కూడా చేయకూడదు. – పోట్లపల్లి వీరభద్రరావు, పర్యావరణవేత్త, న్యాయవాది గిరిపుత్రులకు నిజమైన లబ్ధి చేకూరుతోందా? అడవుల పరిరక్షణ, అభివృద్ధి, పోడు భూములకు పట్టాలు వంటి అంశాల విషయంలో ప్రభుత్వం, పౌరసమాజం తాము అనుసరిస్తున్న విధానాలు, పద్ధతులను సమీక్షించుకోవాలి. అభివృద్ధి పేరిట అడవులకు, పోడుభూముల పేరిట ఆదివాసీ, గిరిపుత్రులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తున్నామనేది ఆత్మపరీక్ష చేసుకోవాలి. పోడు చేసుకునే వారికి పట్టాల అందజేతకు మళ్లీ కొత్తగా అవకాశాలిస్తామంటే ఈ నెపంతో జరిగే విధ్వంసం ఇక్కడితో ఆగదు. దీనివల్ల మళ్లీ కొత్తగా పోడు కొట్టే ప్రమాదం ఉంది. రాజకీయ నేతల అండదండలున్న వారికి, గిరిజనేతరులకే ఈ ప్రయోజనాలు దక్కుతాయి – సరస్వతి రావుల, పర్యావరణవేత్త, నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ (ఎన్ఏపీఎం) పూర్వ కన్వీనర్ -
చైనాపై జపాన్ దురాక్రమణ డ్రాగన్ సీడ్
1930వ దశకంలో చైనా పల్లీయులు రేడియోలు ఎరగరు. వారికి వార్తాపత్రికలు తెలియవు. వారున్న గ్రామానికి వెలుపల ఒక ప్రపంచమున్నదనే తెలీదు. యింటికి పుస్తకం వచ్చిన రోజుని ఒక దుర్దినంగా ఆ యింటి యజమానురాలు భావిస్తుంది. యీ లక్షణాలన్నీ నవలలో కనపడతాయి. ప్రఖ్యాత పాశ్చాత్య రచయిత్రి పెర్ల్ ఎస్. బక్ చైనీయుల గురించి రచించిన గొప్ప నవలలో ప్రసిద్ధి పొందిందీ, ఆమెకు నోబెల్ బహుమతిని తెచ్చి పెట్టిందీ ‘ద గుడ్ ఎర్త్’(1931). ఆ తరువాత అంత ప్రాచుర్యాన్నీ పొందిన నవల ‘డ్రాగన్ సీడ్’(1942). యీ నవలని హాలీవుడ్ చిత్రంగానూ నిర్మించారు. చిత్రం విజయవంతమైంది. బక్ 1892లో అమెరికాలో జన్మించినప్పటికీ అనేక కారణాల వల్ల వివిధ దశల్లో చైనాలో చాలాకాలం నివసించారు. వారి జీవితాన్ని దగ్గరగా పరికించారు. చైనీస్ భాషని నేర్చుకున్నారు. అక్కడి గ్రామీణ జీవితంతో ఆమెకు బాగా పరిచయం వున్నది. చివరికి చైనా రాజకీయ విధానాలతో విసుగెత్తి అమెరికా తిరిగి వచ్చారు. రచయిత్రిగా, సంఘసేవకురాలిగా మనుగడ సాగించి 1973లో మరణించారు. డ్రాగన్ సీడ్ పేరులోనే ప్రత్యేకత వున్నది. చైనా సాంప్రదాయ రీతిలో డ్రాగన్ అనేది దుష్ట జంతువు కాదు. దాన్ని వారు పిలిస్తే పలికే దైవంగా ఆరాధిస్తారు. ఆ మాటనే శాంతీ ప్రగతీ శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా భావిస్తారు. అటువంటి ‘అంకురం’ యీ నవల్లో కనపడుతుంది. ఈ దాడి జరిగిన కాలంలో పెర్ల్ బక్ చైనాలో లేదనీ, యీ నవలకు సంబంధించిన ముడి సమాచారాన్ని ఆమె సేకరించి వ్రాసారనే విమర్శలున్నప్పటికీ యిది గొప్ప నవలల కోవకి చెందుతుంది. లైఫ్ మేగజైన్ వారి 1924–44 మధ్య వెలువడిన వంద గొప్ప పుస్తకాల జాబితాలో చోటు సంపాదించుకొంది. 1937లో చైనాను జపాన్ దురాక్రమణ చేసింది. జపాన్ సైనికులు చేసిన మారణహోమాన్ని ‘నాంకింగ్ మానభంగం’ అని చైనా చరిత్రలో పేర్కొంటారు. ఆ దౌర్జన్య కాండే యీ నవలకు నేపథ్యం. దాని ఫలితంగా ఛిన్నాభిన్నమైన అమాయక రైతు కుటుంబమే యీ నవలకు కథావస్తువు. సాటి మానవుడే శత్రువు రూపంలో దానవుడై వినాశనానికీ విధ్వంసానికీ పాల్పడినప్పటికీ దాన్ని తట్టుకొని మరో మానవుడు నిలబడగలడనీ మనగలడనీ యీ నవల ఒక ఆశావాదాన్ని ప్రబోధిస్తున్నది. వాస్తవ జీవితంలో లాగే నవలలోనూ బహుపాత్రలుంటాయి. కథనం నాంకింగ్ పట్టణానికీ అక్కడికి కాలినడక దూరంగా వున్న వ్యవసాయాధారిత పల్లెకూ మధ్య నడుస్తుంది. చైనీయుల జీవన విధానాన్ని సరళమైన ఇంగ్లిష్ శైలిలో బక్ అద్భుతంగా వర్ణించి విశదీకరిస్తారు. లింగ్టాన్ ఒక చైనీస్ పల్లె రైతు. శత్రువు జీవితాల్ని విచ్ఛిన్నం చేయగలడు; సంపదల్ని కొల్లగొట్టగలడు; కానీ నేలను మాత్రం అపహరించలేడు అన్న ఉద్దేశంతో వ్యవసాయాన్ని నమ్ముకున్నవాడు. అనుకూలవతిౖయెన భార్యా, వ్యవసాయానికి తగిన దృఢ శరీరం గల ముగ్గురు కొడుకులూ, ఆపైన యిద్దరు కుమార్తెలూ, యిద్దరు కోడళ్ళూ వున్నారు. మనుమలున్నారు. పెద్దకుమార్తె భర్తతో పట్నంలో వుంటున్నది. వారికీ పిల్లలున్నారు. సారవంతమైన చైనా నేల వారి కుటుంబానికి జీవనాధారంగా విలసిల్లుతున్నది. అందరూ ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. 1930వ దశకంలో నాటి చైనా పల్లీయులు రేడియోలు ఎరగరు. వారికి వార్తాపత్రికలు తెలియవు. అసలు వారున్న గ్రామానికి వెలుపల ఒక ప్రపంచమున్నదనే తెలీదు. యీ లక్షణాలన్నీ నవలలో కనపడతాయి. నిరక్షరాస్యత కరడుగట్టి వున్నది. నవలలో ఆ యింటికి ఒక పుస్తకం వచ్చిన రోజుని ఒక దుర్దినంగా ఆ యింటి యజమానురాలు భావిస్తుంది. జపాన్ వారి దురాక్రమణ చైనా వారి జీవితాల్లో కల్లోలం రేపింది. విమానాల ద్వారా బాంబులు వర్షించాయి. పట్టణాలు నేలమట్టమైనాయి. ఆరువారాల పాటు సైనికుల హింసా కాండ నిరాఘాటంగా కొనసాగింది. చైనా పాలకులు పరారైనారు. వారి సైన్యం చెల్లాచెదురైంది. రెండులక్షల మంది చనిపోయారు. వేలాదిమంది క్షతగాత్రులుగానూ, నిరాశ్రయులుగానూ మిగిలిపోయారు. పల్లెలు ఆక్రమితమైనాయి. జీవనాధారమైన వారి పంటలు నాశనమైనాయి. చైనా భూభాగమే రక్తసిక్తమైంది. వీటన్నిటినీ నవల్లో సందర్భోచితంగా చక్కగా చిత్రించారు రచయిత్రి. లింగ్టాన్ యింట్లో శాంతి భగ్నమైంది. అతడి వృద్ధ వియ్యపురాలూ, కోడలూ మానభంగానికీ హత్యకూ గురైనారు. సైనికులు స్త్రీల శవాలనూ అనుభవించడం మానవ చరిత్రలోనే మాయనిమచ్చగా మిగుల్తుంది. చివరకు స్త్రీలు లభించకపోవడంతో లింగ్టాన్ అందమైన చిన్న కొడుకునే మానభంగం చేస్తారు. వాడు సిగ్గుతో యిల్లు వదలి కొండలు పట్టిపోతాడు. భయభ్రాంతులైన ప్రజలు యిళ్ళూవాకిళ్ళూ వదలి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పశ్చిమాన వున్న పర్వత ప్రాంతాలవైపు వలసపోసాగారు. లింగ్టాన్ రెండో కొడుకూ కోడలూ వారి వెంట వెళ్ళారు. అంతవరకూ ఐక్యతతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబం చెట్టుకో పిట్టగా చెదిరిపోయారు. వ్యాపారమే పరమావధి కాగా శత్రువుతో కూడా సహజీవనం చెయ్య గల వ్యక్తులకు ప్రతినిధిగా లింగ్టాన్ అల్లుడు నిలుస్తాడు. ఆ రోజుల్లోనే చదువుకున్న విప్లవ వనితగా రెండో కోడలు నిలుస్తుంది. ఆమె ముసలి వేషంలో వెళ్లి, విందులో పాల్గొంటున్న శత్రువులకు విషం నింపిన బాతుల్ని అమ్మి వారంతా చనిపోయేటట్టు చెయ్యగలుగుతుంది. దుఃఖంతో కృంగిపోయిన లింగ్టాన్ కుటుంబం ధైర్యాన్ని కూడగట్టుకొని తిరుగుబాటు బాటపట్టింది. గ్రామస్తులు దళాలుగా ఏర్పడి దొరికిన శత్రువుని మట్టుబెట్టడం నేర్చుకున్నారు. తన గ్రామ దళానికి లింగ్టాన్ నాయకత్వం వహిస్తున్నాడు. చీమకు కూడా అపకారం చెయ్యని అతడు శత్రువు పట్టుబడితే చాలు నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాడు. అతని భార్య కూడా నైతిక బలాన్నిస్తున్నది. అతని కుమారులూ, ఆ గ్రామ యువకులూ కలిసి ఆ యింట్లోనే ఒక నేల మాళిగ ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే ఆయుధాలు దాచుకున్నారు. అక్కడే సమావేశాలు నిర్వహించి గెరిల్లా పోరాటాన్ని మొదలుపెట్టారు. చైనీయుల యీ సై్థర్యమే యీ నవలకు డ్రాగన్ సీడ్ (క్షాత్ర బీజం) అని పేరు పెట్టడానికి కారణమై వుంటుంది. రానున్న రెండో ప్రపంచ యుద్ధపు సంకేతాలు చైనా ప్రజలకు అందుతాయి. తమ శత్రువు (జపనీయులు)కు వారికన్నా బలమైన శత్రువు (అమెరికా, రష్యా) లున్నారని వారు తెలుసుకొని సంబరపడతారు. రైతాంగం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న వర్షసూచనలతో నవల ఆశావహంగా ముగుస్తుంది. యుద్ధం వల్ల కలిగే వినాశనాన్నీ, సైనికుల క్రౌర్యాన్నీ, అకృత్యాల్నీ సరళమైన యింగ్లిష్లో బక్ సమర్థవంతంగా చిత్రించారు. ఒక చారిత్రక దుశ్చర్య ఆధారంగా వ్రాసిన యీ నవల విశ్వసాహితీ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. (వ్యాసకర్త ‘డ్రాగన్ సీడ్’ నవలను తెలుగులోకి అనువదించే ప్రయత్నంలో ఉన్నారు.) -
ఆక్రమణల తొలగింపు
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థకు చెందిన రెండు రిజర్వ్డ్ స్థలాలను స్టోన్‌హౌస్‌పేటలో వాణిజ్య వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి గదులను నిర్మించారు. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదు మేరకు టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆక్రమణల తొలగింపును చేపట్టారు. ఆదిత్యనగర్‌లో ఎల్పీ నంబర్ 94 / 92 స్థలంలోని 96 అంకణలు కలిగిన రెండు పార్క్ స్థలాలను ఆక్రమించి ప్రహరీ, రెండు గదులను నిర్మించారు. ఈ క్రమంలో 16వ డివిజన్ అభివృద్ధి కమిటీ గతేడాది నుంచి స్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పలుమార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం కూడా కబ్జా పర్వాన్ని కమిషనర్‌కు వివరించారు. ఈ క్రమంలో శుక్రవారం ఏసీపీ రంగరాజు ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసుల సాయంతో జేసీబీతో ఆక్రమణలను కూల్చేశారు. కానరాని కబ్జాదారులు కబ్జా చేసిన స్టోన్‌హౌస్‌పేటలోని వాణిజ్య వ్యాపారి, అధికార పార్టీ నేత ఆక్రమణల తొలగింపు సమయంలో కానరాలేదు. ఓ మాజీ ఎమ్మెల్యే సాయంతో కబ్జా చేశారు. ప్రస్తుతం కబ్జాను అడ్డుకుంటే తనకు చెడ్డ పేరొస్తుందనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి చేరుకోలేదని సమాచారం. టీపీఓ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని బెదిరించి అక్రమించుకున్నారు
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం ఖిలానగర్‌లోని తమ సొంత స్థలం 1780 చదరపు గజాలను నయీమొద్దీన్ గ్యాంగ్ బెదిరించి రిజిస్టర్ చేయించుకున్న దానిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన వారాల శ్రీనివాస్ తండ్రి వెంకటయ్య, వారాల కృష్ణ తండ్రి వారాల వెంకటయ్య, వారాల అశోక్ తండ్రి వెంకటయ్యలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు వారిమాటల్లోనే.. మాకు భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న సర్వేనెంబర్ 8లో రూ. కోటి యాబైలక్షల విలువగల ఐదు మడిగెలు, మూడు ఆర్సీసీ రూములు, ఖాళీ స్థలము మొత్తం 1780 చదరపు గజాలు ఉందన్నారు. నయీమ్ అతని అనుచరులు పాశం శ్రీనివాస్, పెంట నర్సింహ, గొర్రెంకల శివశంకర్, కొంత మంది అనుచరులతో వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నించారన్నారు. అందుకు గాను నయీమ్ అనుచరులు పాశం శ్రీను, అతని అనుచరులు హైదరాబాద్ చంపాపేట్‌లో నివసిస్తున్న మా వద్దకు పలుమార్లు వచ్చి మా ఆస్తిని ఇవ్వమని లేకుంటే మమ్ములను మాకుటుంబ సభ్యులను చంపుతామని భయబ్రాంతులకు గురిచేశారన్నారు. రూ. కోటి 50 లక్షల విలువ గల ఆస్తిని కేవలం రూ.40 లక్షలు ఇచ్చి బలవంతంగా నయీమ్ తన తరుపు బంధువుల పేరుమీద 13 డాక్యుమెంట్లు తయారు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. మా విలువైన ఆస్తిని మాకు తిరిగి ఇప్పించాలలి. అలాగే మాకు నయీమ్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలి. -
మమ్మల్ని బెదిరించి అక్రమించుకున్నారు
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం ఖిలానగర్‌లోని తమ సొంత స్థలం 1780 చదరపు గజాలను నయీమొద్దీన్ గ్యాంగ్ బెదిరించి రిజిస్టర్ చేయించుకున్న దానిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన వారాల శ్రీనివాస్ తండ్రి వెంకటయ్య, వారాల కృష్ణ తండ్రి వారాల వెంకటయ్య, వారాల అశోక్ తండ్రి వెంకటయ్యలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు వారిమాటల్లోనే.. మాకు భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న సర్వేనెంబర్ 8లో రూ. కోటి యాబైలక్షల విలువగల ఐదు మడిగెలు, మూడు ఆర్సీసీ రూములు, ఖాళీ స్థలము మొత్తం 1780 చదరపు గజాలు ఉందన్నారు. నయీమ్ అతని అనుచరులు పాశం శ్రీనివాస్, పెంట నర్సింహ, గొర్రెంకల శివశంకర్, కొంత మంది అనుచరులతో వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నించారన్నారు. అందుకు గాను నయీమ్ అనుచరులు పాశం శ్రీను, అతని అనుచరులు హైదరాబాద్ చంపాపేట్‌లో నివసిస్తున్న మా వద్దకు పలుమార్లు వచ్చి మా ఆస్తిని ఇవ్వమని లేకుంటే మమ్ములను మాకుటుంబ సభ్యులను చంపుతామని భయబ్రాంతులకు గురిచేశారన్నారు. రూ. కోటి 50 లక్షల విలువ గల ఆస్తిని కేవలం రూ.40 లక్షలు ఇచ్చి బలవంతంగా నయీమ్ తన తరుపు బంధువుల పేరుమీద 13 డాక్యుమెంట్లు తయారు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. మా విలువైన ఆస్తిని మాకు తిరిగి ఇప్పించాలలి. అలాగే మాకు నయీమ్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలి. -
బస్సు ఆగని షెల్టర్లు
-
అటవీ భూమి ఆక్రమణ
హనుమాన్‌జంక్షన్ : బాపులపాడు మండలం మల్లవల్లిలో సుమారు 80 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఆర్ఎస్ నంబర్ 11లోని ఈ భూమిని ఆక్రమించిన బడాబాబులు రాత్రి సమయాల్లో పొక్లెయిన్‌తో భూమిని చదును చేయించారు. నాలుగు అడుగుల వరలతో మూడు అడుగుల నీటితొట్టెలు 50 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. మామిడి మొక్కలు కూడా నాటారు. ఒకవైపు ఫెన్సింగ్ కూడా పూర్తిచేశారు. మిగిలిన మూడువైపుల గుంతలు తీసి ఫెన్సింగ్ పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేశారు. పక్షం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి.. ఆర్ఎస్ నంబరు 11లో 1,460 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో వంద ఎకరాలు గతంలో ఉద్యానశాఖ వన నర్సరీకి కేటాయించగా, మిగిలిన భూమి ఆక్రమణలకు గురైంది. గత కాంగ్రెస్ సర్కారు హయాంలో నిరుపేదలకు కొంత భూమి కేటాయించి బడాబాబుల ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. నిరుపేదల ఆక్రమణలకు సంబంధించి వివరాలు సేకరించారు. ఆక్రమణలు జరిగిన, మొక్కలు నాటని భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లుగా ప్రకటించారు. అలా ఉన్న భూమి నిరుపేదల ఆధీనంలో ఉండడంతో ఇటీవల ఇద్దరు ఆక్రమణదారులు కొంత సొమ్ము ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఇవ్వనివారిని కూడా బెదిరించి మరికొంత భూమి స్వాధీనం చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం విలేకరుల బృందం ఈ అటవీ భూములను పరిశీలించగా ఇక్కడ జరుగుతున్న బాగోతం బట్టబయలైంది. గ్రామ వీఆర్వో ఏసుపాదంను ‘సాక్షి’ వివరణ కోరగా నైజాం ప్రభుత్వం నుంచి ఆ భూములు కొనుగోలు చేసినట్లు ఆక్రమణదారులు చెబుతున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారుల హడావుడి ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించారు. హుటాహుటిన ఆక్రమిత స్థలం వద్దకు చేరుకొని ట్రాక్టర్‌తో ఫెన్సింగ్, నీటి తొట్టెలను ధ్వంసం చేశారు. ఆక్రమణలపై మండల తహశీల్దారు కె.గోపాలకృష్ణ వివరణ ఇస్తూ.. మల్లవల్లి గ్రామంలో అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు తెలిసిందన్నారు. గొల్లపల్లికి చెందిన పొట్లూరి గోపాలకృష్ణ, పంతం కామరాజు సుమారు 80 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినట్లు గ్రామ రెవెన్యూ అధికారి చెప్పారని వివరించారు. వారిద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
సమన్వయ లోపం.. కబ్జాల రాజ్యం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పోలీసు శాఖ నిర్లక్ష్యం, రెవెన్యూ శాఖ మెతక వైఖరి కారణంగా శంకర్పల్లి మండలంలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో దర్జాగా పాగావేస్తున్న ఆక్రమణదారులు.. చర్యలకు వచ్చిన అధికారులపై ఏకంగా ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ పరిస్థితిపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టనట్లు వ్యవహరించడంతో మండల పరిధిలో ఇలాంటి ఆక్రమణలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. గత వారం మండలంలోని దొంతన్‌పల్లి గ్రామం సర్వేనంబర్ 197లోని ఎకరా ప్రభుత్వ భూమిని స్థానికుడు ఆక్రమించి వరిపంట సాగుచేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన అనంతరం భూమిని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. సదరు ఆక్రమణదారుడి సంబంధీకులు రెవెన్యూ అధికారిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చే యగా.. మూడు రోజుల తర్వాత కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో తీవ్రజాప్యం చేయడం గమనార్హం. ఇదేమి సమన్వయం..! రాజధానికి అత్యంత చేరువలో శంకర్పల్లి మండలం ఉండడం, భూముల విలువ ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఆక్రమణలు కూడా పెద్దఎత్తున జరుగుతున్నాయి. అయితే ఈ ఆక్రమణలు రెవెన్యూ అధికారుల దృష్టికి రావడం.. వాటిపై చర్యలకు దిగుతున్నప్పటికీ ఎదురుదాడి జరగడంతో చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. ఈ పరిస్థితిని అదనుగా చేసుకుని మరోవైపు ఆక్రమణల పరంపర జోరుగా సాగుతోంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఎల్వర్తి గ్రామంలో సర్వే నంబర్ 160లో అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి మొక్కజొన్న వేశాడు. అయితే ఆక్రమణపై స్థానిక అధికారులు చర్యలకు ఉపక్రమించగా స్థానికులతో కలిసి పెద్ద రాద్దాంతం చేయడంతో అధికారులు వెనక్కితగ్గారు. సింగాపూర్ గ్రామంలో సర్వేనంబర్ 249లో సీలింగ్ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానిక నేత రంగంలోకి దిగి ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి తేవడంతో రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరుగుముఖం పట్టారు. సింగాపూర్ గ్రామంలోని ఓ వాగులో స్థానికుడొకరు ఆక్రమణ చేశాడు. వాగు నీటిని అక్రమంగా తన పొలం వైపు మళ్లించేందుకు పెద్దఎత్తున మట్టితో పూడ్చివేశాడు. ఈ అంశంపై రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. {పొద్దుటూరులో అక్రమంగా ఇసుక తరలింపు విషయంలో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అదేవిధంగా ఈ గ్రామంలో రెండు వెంచర్లపైనా కేసులు నమోదు చేసినప్పటికీ ఫలితం లేదు. శంకర్‌పల్లిలోని 196 సర్వే నంబర్లో అక్రమ వెంచర్‌పై చర్యలకు రెవెన్యూ అధికారులు ఉపక్రమించారు. అయితే వెంచర్ యాజమాన్యం రెవెన్యూ అధికారులపై ఎదురుదాడికి దిగడంతో చర్యలు నిలిపేశారు. ఈ విషయంలోనూ పోలీసులు మెతకవైఖరి అవలంబిస్తున్నారని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. పై అధికారుల వద్దకు పంచాయితీ.. మండలంలో అక్రమార్కుల ఆగడాలపై రెండ్రోజుల క్రితం కలెక్టర్ బి.శ్రీధర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. రెవెన్యూ సిబ్బందిపై దాడులు, కే సు నమోదులో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా వివరించినట్లు మండల తహసీల్దార్ వసంతకుమారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.