బాణాసంచా పేలుడు: ముగ్గురు మృతి | Three killed in cracker factory blast at A. Kothapalli in visakhapatnam | Sakshi
Sakshi News home page

బాణాసంచా పేలుడు: ముగ్గురు మృతి

Published Wed, Aug 17 2016 12:55 PM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

Three killed in cracker factory blast at A. Kothapalli in visakhapatnam

విశాఖపట్నం: బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం ఏ. కొత్తపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా అనధికారికంగా నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ పని చేస్తున్న ముగ్గురు కూలీలు సజీవదహనమైయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి.

దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... ఫైరింజన్లలో మంటలు ఆర్పుతున్నారు. అయితే ఈ ఘటనపై అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement