మూడు లారీల ఢీ
మూడు లారీల ఢీ
Published Fri, Aug 26 2016 9:35 PM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM
కోవూరు : మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఓ లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన స్థానిక జాతీయరహదారి తూర్పు అరుంధతీయవాడ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణపట్నం పోర్టు నుంచి కడపకు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి ఇచ్చాపురాని వరినాటే యంత్రాన్ని తీసుకుని వెళ్తున్న లారీ వేగంగా ఢీకొంది. దీంతో బొగ్గు లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో బొగ్గు లారీడ్రైవర్ ఆకుల రవిబాబు (39) అక్కడికక్కడే మృతి చెందారు. అదే లారీ క్లీనర్ తాడిపర్తికి చెందిన ప్రతాప్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఇచ్చాపురానికి వరినాటే యంత్రాలు తీసుకెళ్లే లారీలో ఉన్న శివకుమార్‌కు రెండు కాళ్లు విరిగాయి. క్షతగాత్రులిద్దరిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న అళహరి వెంకట్రావు ఏఎస్‌ఐ మురళి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రహదారికి అడ్డంగా ఉన్న లారీలను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. రవిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement