ట్రాక్టర్‌పై నుంచి పడి డ్రైవర్ దుర్మరణం
కొత్తూరు (ఇందుకూరుపేట): అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ ట్రాక్టర్‌పై నుంచి జారిపడి డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని కొత్తూరు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నాల్గో మైలు దొరంతోపు కాలనీకి చెందిన యాటగిరి హరి (40)ట్రాక్టర్‌లో ఇసుక, సిమెంట్‌ను తీసుకుని మండలంలోని పాములవారిపాళెంకు వచ్చాడు. వాటిని అన్‌లోడ్ చేసి తిరిగి నెల్లూరుకు వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను అతివేగంగా నడపడంతో జీవీకే చిన్మయ విద్యాలయం సమీపాన ఉన్న స్పీడు బ్రేకర్లు వద్దకు వచ్చే సరికి డ్రైవర్ హరి అదుపు తప్పి కింద పడ్డాడు. అతనిపై ట్రాక్టర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షరీఫ్ తెలిపారు.