ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి మృతి | three men and more than 100 sheeps died | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి మృతి

Published Thu, Dec 29 2016 8:58 AM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

three men and more than 100 sheeps died

పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి పులివెందుల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు గొర్రెల కాపరులతో పాటు సుమారు 100 గొర్రెలు మృతిచెందాయి. మృతులు తొండూరు మండలం పోరవానిపల్లె గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement