sheep died
-
ముగ జీవాల మృత్యువాత
మిర్యాలగూడ రూరల్ : పాలమూరు జిల్లా గొర్రెల మందను మృత్యు వీడడం లేదు. మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టుకు వేసవిలో మేత కోసం11 మంది యజమానులు తమకున్న 3000 గొర్రెలతో బయలుదేరారు. వారు శుక్రవారం మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామ శివారుకు చేరుకున్నారు. అక్కడ మందలోని గొర్రెలు అనారోగ్యనికి గురై 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ పశు సంవర్థకశాఖ సిబ్బంది పశు వైద్యులు చికిత్స అందింస్తున్నప్పటికీ గొర్రెల మరణాన్ని అరికట్టే పరిస్థితి లేకపోయింది. æ రెండవ రోజు శనివారం మరి 31గొర్రెలు మృతిచెందాయి. రక్త నమూనాలు, శరీరంలో భాగాల ముక్కలు షాంపిల్స్ హైదరాబాద్ వెటర్నరీ బయోజికల్ ల్యాబ్కు పంపించారు. వాటి ఫలితాలు రావాలంటే కనీసం 48 గంటలు పడుతుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. కాగా నల్లగొండకు పంపిన ల్యాబ్ టెస్ట్ ఫలితాల ప్రకారం విష ఆహారం, అజీర్ణ సమస్యతో పాటు చిటక రోగం, పుర్రు రోగం సోకినట్లు మిర్యాలగూడ ఏడీ వెంకట్రెడ్డి తెలిపారు. కొనసాగుతున్న వైద్యశిబిరం మిర్యాలగూడ , త్రిపురారం వెటర్నరీ వైద్య బృదం గొర్రెలకు చికిత్స అందస్తున్నారు. వ్యాధి నిరోధక మందులు, సెలెన్ అందిస్తున్న కంట్రోలు కాకపోవడంతో ఇటు వైద్యులు, అటు గొర్రెలు మందల యజమానులు అందోళన చెందుతున్నారు. కానరాని స్పందన కాగా నాలుగు రోజులుగా గొర్రెలు నిరంతరం మరణిస్తున్నప్పటికీ అధికారులెవరూ స్పందించక పోవడం బాధాకరం. గొర్రెలనే నమ్ముకుని జీవ నం సాగిస్తూ జిల్లా దాటి వచ్చి ఇక్కడ అకస్మాత్తుగా జీవాలు మృతి చెందుతుండడంతో కాపరులు ఏమి పాలుపోక ఆందోళన చెందుతున్నారు. -
కుక్కల దాడిలో 40 గొర్రెపిల్లల హతం
డోన్ టౌన్ : కృష్ణగిరి మండలం కర్లకుంట శివారులో ఆదివారం కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు..మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వీరకుమార్ మేపు కోసం మందను కృష్ణగిరి మండలం కర్లకుంటకు తీసుకెళ్లారు. ఉదయం గొర్రెపిల్లలను కల్లం(ముళ్లకంప మధ్య)లో ఉంచి గొర్రెల మేపు కోసం బయటకు తీసుకెళ్లారు. ఇంతలో ఊరకుక్కలు కల్లంలో ఉన్న గొర్రె పిల్లలపై దాడి చేశాయి. ఘటనలో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. మరో పదింటికి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న కాపరులు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు రూ.1.6 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. -
రైలు ఢీకొని 50 గొర్రెల మృతి
కామారెడ్డి : కామారెడ్డి రూరల్ మండలం అడ్లూర్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరి సాయిలుకు కూడా గాయాలయ్యాయి. గొర్రెల మృతితో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి మృతి
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి పులివెందుల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు గొర్రెల కాపరులతో పాటు సుమారు 100 గొర్రెలు మృతిచెందాయి. మృతులు తొండూరు మండలం పోరవానిపల్లె గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.