మంగళవారం సాయంత్రం పిడుగులు పడి జిల్లా వ్యాప్తంగా నలుగురు చనిపోయారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బత్తిని అఖిల్ గౌడ్ పిడుగుపాటుకు మృతిచెందాడు.
కరీంనగర్ : మంగళవారం సాయంత్రం పిడుగులు పడి జిల్లా వ్యాప్తంగా నలుగురు చనిపోయారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బత్తిని అఖిల్ గౌడ్ పిడుగుపాటుకు మృతిచెందాడు. ఇతడు వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం నందారం గ్రామానికి చెందినవాడు. బంధువుల ఇంటికి వెళ్లి మృత్యువాతపడ్డాడు.
హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో కాసబోయిన సమ్మయ్య అనే రైతు, కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ప్రశాంత్ అనే యువకుడు చనిపోయారు. కాటారం మండల కేంద్రానికి చెందిన వీరబోయిన తిరుపతయ్య(22) అనే గొర్రెల కాపరి కూడా పిడుగుపాటుకు గురై ప్రాణాలొదిలాడు.