- సెప్టెంబర్ 17న అమిత్‌షా రాక
- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
- నల్లు ఇంద్రసేనారెడ్డి
విమోచనాన్ని అధికారికంగా నిర్వహించాలి
Published Wed, Aug 17 2016 12:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
హన్మకొండ : తెలంగాణ విమోచన దినోత్సవం (సెప్టెంబ ర్ 17)ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశా రు. హన్మకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్‌హాల్ లో మంగళవారం బీజేపీ అర్బన్ జిల్లా పదాధికారులు, కో ర్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. అంతకుముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దాశరథి, రామానందతీర్థ, చాకలి ఐలమ్మ, బందగి, కొమురంభీం తదితరుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నైజాం పాలన చరిత్రను గుర్తిస్తూ మాట్లాడిన కేసీఆర్ అధికారంలోకి రా గానే కుటుంబసభ్యుల చరిత్ర మాత్రమే ఉండేలా చూస్తున్నారని ఆరోపించారు. నైజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న విమోచనం పొందిందని తెలిపారు. నాడు కన్నడ మాట్లాడే ప్రాంతాలు కర్ణాటకలో, మరాఠి మాట్లాడే ప్రాంతాలో మహారాష్ట్రలో కలిశాయన్నారు. అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. నైజాం సంతతికి చెందిన మజ్లిస్ పార్టీ సాన్నిహిత్యంతోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు.
నెల రోజులపాటు కార్యక్రమాలు
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ఆధ్వర్యంలో నెల రోజులు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపా రు. సెప్టెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు పోస్ట్‌కార్డు ఉద్యమం, బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, మహిళా మోర్చ ఆధ్వర్యంలో మహిళా కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దళితమోర్చ ఆధ్వర్యంలో ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మాజీ సైనికులకు రాఖీలు కట్టనున్నట్లు తెలిపా రు. సెప్టెంబర్ 17న ప్రభుత్వం జాతీయ జెండా ఎగురవేయకపోతే అన్ని గ్రామాలు, పట్టణాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఎగురవేస్తామ ని చెప్పారు. అదేరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నట్లు వెల్లడించారు. బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు చింతాకుల సునీల్, రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, నాయకులు చాడా శ్రీనివాస్‌రెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి, బన్న ప్రభాకర్, ఎరుకల రçఘునారెడ్డి, బింగి శ్రీనివాస్, తోట సురేష్, లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.
Advertisement