
రుణమాఫీ చేయాలని బ్యాంక్ ఎదుట ధర్నా
అవంతీపురం(మిర్యాలగూడ రూరల్): టీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన రైతుల రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తు తెలుగు దేశం పార్టీ నాయకులు మంగళవారం అవంతీపురంలోని సిండికేట్ బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సాధినేని శ్రీనావాసరావు, ఎండీ యూసూఫ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తు, రుణ మాఫీ ఒకే పర్యాయం కాకుండా 25 శాతం చే స్తామని ప్రకటించడం శోచనీయ మన్నారు. ఏక కాలంలో రుణ మాఫీ చే సి కరువు కాలంలో కర్షకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పాతూరి ప్రసాద్, కాసుల సత్యం నాయకులు భిక్షం యాదవ్, విద్యాసాగర్, శ్రీనివాస్, బచ్చసైదులు, అంజి బాబు, సావిత్రమ్మ, కన్నారెడ్డి, సైయ్యద్, మదార్, రమ పాల్గొన్నారు.