loanwaiver
-
రుణమాఫీ..గందరగోళం!
సాక్షి, నల్లగొండ : రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఆయా ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ రుణాలను చెల్లించకుండా రుణమాఫీ వర్తిస్తుందన్న ధీమాలో ఉన్నారు. దాంతోపాటు మరో పార్టీ ఏకంగా రూ.2లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీతో మరికొందరు రైతులు తమ రుణాలను రెన్యువల్ కూడా చేయించుకోని పరిస్థితిలో ఉన్నారు. కానీ రూ.లక్ష వరకు రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు, గైడ్‌లైన్స్ కూడా అటు బ్యాంకులకు గానీ, ఇటు జిల్లా వ్యవసాయ శాఖకుగానీ పంపించలేదు. అసలు జిల్లాలో ఎంతమంది రైతులు పంటరుణాలను తీసుకున్నారు, దానికి సంబంధించిన నగదు ఎంత అనేది కూడా బ్యాంకుల వద్దగానీ, వ్యవసాయ శాఖ వద్దకూడా గణాంకాలు లేని పరిస్థితి. జిల్లా లీడ్ బ్యాంకుకు కూడా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో వారు కూడా ఎలాంటి గణాంకాలను సే కరించలేదని తెలుస్తోంది. అసలు రుణమాఫీ వస్తుందా లేదోనని జిల్లా వ్యాప్తంగా రుణాలు పొందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇ టు రుణాలను రెన్యువల్ చేసుకోక, కొత్త రుణా లను తీసుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. రెన్యువల్ కోసం బ్యాంకర్ల ఒత్తిడి రుణాలను రెన్యువల్ చేయించుకోవాలని బ్యాంకుల అధికారులు రైతులపై ఒత్తిడి పెంచారు. కనీసం వడ్డీ చెల్లించినా కొత్త రుణం కింద రెన్యువల్ చేస్తామని బ్యాంకుల అధికారులు రైతులను పీడిస్తున్నారు. దీంతో రైతులు తాము వడ్డీని చెల్లించి కొత్తరుణం కింద రెన్యువల్ చేసుకుంటే రుణమాఫీ వర్తిస్తుందో లేదో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ చెల్లిస్తే రెన్యువల్ చేస్తారే కానీ తిరిగి పంటరుణాలు ఇవ్వరనే భావనే కూడా రైతులలో నెలకొంది. బ్యాంకుల గడపతొక్కని రైతులు.. బ్యాంకర్లు రుణాల రెన్యువల్ కోసం ఒత్తిడి పెంచుతుండడంతో రైతులు బ్యాంకుల గడపతొక్కడానికి సాహసం చేయడం లేదు. రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వ ఒక స్పష్టతను ఇస్తే తప్ప బ్యాంకులకు రైతులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రెన్యువల్ చేసుకుంటే తిరిగి రుణాలను ఇస్తామన్న భరోసాను కూడా బ్యాంకర్లు రైతులకు కల్పించకపోవడంతోనే రైతులు వెనకడుగువేస్తున్నారు. ఖరీఫ్ రుణలక్ష్యం ఘనం.. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రూ.2225.51 కోట్ల మేరకు పంటరుణాలను ఇవ్వాలని జిల్లా వ్యవసాయశాఖ లక్ష్యాన్ని నిర్ణయించింది. అదే విధంగా బ్యాంకు అధికారుల సమావేశంలో కూడా కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ లక్ష్యం మేరకు పంటరుణాలను రైతులకు చెల్లించాల్సిదేనని ఆదేశాలను జారీ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు కూడా బ్యాంకర్లు కొంతమేరకు పంటరుణాలను రెన్యువల్ మాత్రమే చేశారు తప్ప ఎక్కడా తిరిగి ఖరీఫ్ పంట రుణాలను చెల్లించిన దాఖలాలు కనిపించడం లేదు. దీనిపై జిల్లా లీడ్ బ్యాంకు అధికారి సూర్యంను వివరణ కోరడానికి ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
రుణమాఫీ చేయాలని బ్యాంక్ ఎదుట ధర్నా
అవంతీపురం(మిర్యాలగూడ రూరల్): టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన రైతుల రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తు తెలుగు దేశం పార్టీ నాయకులు మంగళవారం అవంతీపురంలోని సిండికేట్ బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సాధినేని శ్రీనావాసరావు, ఎండీ యూసూఫ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తు, రుణ మాఫీ ఒకే పర్యాయం కాకుండా 25 శాతం చే స్తామని ప్రకటించడం శోచనీయ మన్నారు. ఏక కాలంలో రుణ మాఫీ చే సి కరువు కాలంలో కర్షకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పాతూరి ప్రసాద్, కాసుల సత్యం నాయకులు భిక్షం యాదవ్, విద్యాసాగర్, శ్రీనివాస్, బచ్చసైదులు, అంజి బాబు, సావిత్రమ్మ, కన్నారెడ్డి, సైయ్యద్, మదార్, రమ పాల్గొన్నారు. -
నెలాఖరులోగా రెండోవిడుత రుణమాఫీ
మెదక్ : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంగ్డిలో దీపం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు రెండో విడుత రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీపం పథకం నిలిపివేసినా తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోందని మంత్రి ఈటల అన్నారు. -
మంత్రిగారికి సెల్‌ఫోన్ చిక్కులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేసిన ప్రకటన..వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చిక్కులు తెచ్చిపెట్టింది. రుణమాఫీ జాబితాపై ఏవైనా సమస్యలుంటే మంత్రి పుల్లారావుకు ఫోన్ చేయాలంటూ రఘువీరా ఆయన ఫోన్ నెంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా రైతుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్‌కు మంత్రి ఇబ్బంది పడుతున్నారట. రైతులు తమ సమస్యలు గురించి మంత్రికి ఏకరువు పెడుతున్నారు. రైతుల ఫోన్ కాల్స్‌కు సమాధానం చెప్పలేక మంత్రి అవస్థలు పడుతున్నారు. ఒక్క ఫోన్ కాల్‌కు సమాధానం చెప్పేలోపే 10 మిస్డ్ కాల్స్ వస్తున్నాయంటూ మంత్రి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. -
రుణమాఫీ విధాన ప్రకటనపై చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్నారు. రైతుల రుణమాఫీ విధాన ప్రకటనకు సంబంధించి చంద్రబాబు సమీక్షించనున్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీనిపై ఈ నెల 5న వైఎస్ఆర్ సీపీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ రుణమాఫీపై విధాన ప్రకటన చేయనున్నట్టు వెల్లడించింది. -
ఇప్పుడు బాండ్లు...తర్వాత నగదు చెల్లింపు
-
రుణమాఫీ లేనట్టే..!
-
రుణమాఫీ లేనట్టే..!
బ్యాంకులకు ఆంధ్రప్రదేశ్ రైతులు బకాయిలు కట్టాల్సిందే ప్రతిగా ప్రభుత్వం తరఫున రైతులకు బాండ్లజారీ బకాయి చెల్లిస్తేనే బ్యాంకుల నుంచి కొత్త రుణాలు ఇప్పుడు బాండ్ల జారీ.. తర్వాతి నాలుగేళ్లలో డబ్బుల చెల్లింపు పలు రకాల కసరత్తుల తర్వాత ప్రభుత్వం తేల్చిందిదీ బ్యాంకుల సీఎండీలతో చంద్రబాబు సమీక్ష సాక్షి, హైదరాబాద్: అక్షరాలా కోటి మంది రైతుల రుణాల మాఫీపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రస్తుతానికి రైతులే రుణాలను చెల్లించేయూలన్నట్టుగా చెప్పేసింది. రైతులు చెల్లించిన మొత్తాలకు బాండ్లు జారీ చేసి తదనంతర కాలంలో చెల్లింపులు చేస్తామంటూ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఇంతకాలం రకరకాల కసరత్తుల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది. ఇప్పటికీ సమస్యకు పరిష్కారం చూపకపోగా దాన్ని మరింత సంక్లిష్టంగా మార్చింది. రుణాలను ముందు రైతులే చెల్లించుకుంటే.. ప్రభుత్వ బాండ్ల ద్వారా నాలుగేళ్లలో డబ్బులిచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. సోమవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 23 బ్యాంకులకు చెందిన సీఎండీలతో రుణమాఫీపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 20 శాతం నిధులను బ్యాంకులకు చెల్లిస్తామని, ఆ నిధులను వడ్డీ కింద జమ చేసుకుని రైతుల రుణాలను రెన్యువల్ చేయాలని బ్యాంకర్లను కోరారు. దీనిపై బ్యాంకర్లు స్పందిస్తూ ఏడుగురితో సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని, మంగళవారం చర్చించుకుని విషయం తెలియజేస్తామని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ముగిసిన నేపథ్యంలో అక్టోబర్ వరకు ఖరీఫ్ రుణాల మంజూరును పొడిగించాలని ఎస్ఎల్బీసీ ద్వారా ఆర్బీఐని, అలాగే పంటల బీమా గడువు కూడా ముగిసినందున ఆ గడువును కూడా అక్టోబర్ వరకు పొడిగించాలని బీమా కంపెనీని కోరతామని చంద్రబాబు బ్యాంకులకు చెప్పారు. ఇలావుండగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలకు చెందిన వడ్డీ చెల్లింపు కింద ప్రస్తుతం రూ.6 వేల కోట్లను (20 శాతం) బ్యాంకులకు చెల్లిస్తుంది. అంటే మిగతా 80 శాతం రుణాలను రైతులే బ్యాంకులకు చెల్లించుకోవాలి. ఆ తరువాత నాలుగేళ్ల కాలంలో రైతులకు బాండ్ల రూపంలో డబ్బులు ఇవ్వడానికి ప్రత్యేకంగా రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు ఫైలుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి సోమవారం ఆమోదం తెలిపారు. లక్షన్నర రూపాయల అప్పు ఉంటే ఆ రైతుకు ఒక్కొక్కటి రూ.25 వేల చొప్పున ఆరు బాండ్లను జారీ చేస్తారు. ఆ బాండ్లకు కాలపరిమితి విధిస్తారు. ఆ సమయంలోగా కార్పొరేషన్‌కు వచ్చి 10% వడ్డీతో డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం రైతుల రుణ మాఫీకి పలు షరతులతో కూడిన మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ రైతుల రుణాలు రెన్యువల్ చేయాలి, ఏ రైతులు రుణ మాఫీకి అర్హులనేది తేలకుండా ఏ రైతుల రుణాలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందనే సమస్య నెలకొంది. అసలు రుణ మాఫీ అర్హుల జాబితా ఇప్పటివరకు ఖరారే కాలేదు. దీనికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరు నెలల్లోగా రైతు సాధికారత కార్పొరేషన్‌కు అప్పులు ఇవ్వాల్సిందిగా బ్యాంకులను చంద్రబాబు కోరారు. అయితే ఆరు నెలల్లో కదా.. మార్గదర్శకాల ప్రకారం అప్పుడు ఆలోచిస్తామని బ్యాంకర్లు పేర్కొన్నారు. ‘రైతు సాధికారత’కు కార్పొరేషన్ సాక్షి, హైదరాబాద్: రైతు సాధికారత కార్పొరేషన్ (ఫార్మర్స్ ఎంపవర్మెంట్ కార్పొరేషన్) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తారు. కార్పొరేషన్‌కు ప్రభుత్వం తొలుత ఐదు నుంచి 7 వేల కోట్లను మూలధనంగా ఉంచుతుంది. ఈ కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారి ఎండీగా వ్యవహరిస్తారు. డెరైక్టర్లు కూడా ఉంటారు. బ్యాంకుల నుంచి గతంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు ఒక్కొక్కటి రూ.25 వేల ముఖ విలువ గల బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి1 నుంచి ఈ బాండ్లను రైతులు అవసరమైతే కార్పొరేషన్‌కు అప్పగించి నగదు తీసుకోవచ్చు. కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో ప్రభుత్వం సమకూర్చే మూలధనాన్ని రైతులు చెల్లించాల్సిన రుణాల స్థానంలో బ్యాంకులకు చెల్లిస్తారు. ఎంపీ సుజనా చౌదరి నేతృత్వంలోని ప్రభుత్వ వనరుల సమీకరణ కమిటీ సోమవారం తొలుత బ్యాంకర్లతో సమావేశమైంది. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లు, వనరుల సమీకరణ కమిటీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రణాళికా మండలి వైస్‌చైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ పాల్గొన్నారు.అనంతరం వివరాలను కుటుంబరావు, రమేష్ తదితరులతో కలిసి సుజనా చౌదరి మీడియాకు వెల్లడించారు. పలువురు బ్యాంకు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. సుజనా చౌదరి విలేకరుల సమావేశంలో వెల్లడించిన, ఆ తరువాత ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ అందచేసిన వివరాల ప్రకారం.... కార్పొరేషన్ ఏర్పాటు గురించి బ్యాంకర్లకు వివరించాం. కార్పొరేషన్‌కు ప్రభుత్వం మూలధనం సమకూర్చటం, ఆ మొత్తాన్ని కార్పొరేషన్ బ్యాంకులకు చెల్లించటం గురించి తెలిపాం. వారు ఒక సబ్ కమిటీని నియమించుకున్నారు. మంగళవారం జరిగే బ్యాంకర్ల సమితి సమావేశం సమయానికి వారి నిర్ణయాన్ని వెల్లడిస్తారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌తో ఉంది. దాన్ని అధిగమించేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు రైతాంగానికి రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లకు సంబంధం ఉండదు. రుణమాఫీపై చేసిన ప్రతిపాదనను బ్యాంక ర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు. బ్యాం కులు ప్రస్తుతం ఉన్న రుణాలను బుక్ ఎడ్జెస్ట్ చేసుకుని కొత్తవి ఇవ్వాల్సిందిగా కోరాం. ఈ నెలాఖరుకు బీమాకు సంబంధించి గడువు ముగిసిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్టేట్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌తో మాట్లాడాం. వారు మరో నెల రోజులు గడువు పొడిగించారు. రైతులు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని మేం ఏకమొత్తంగా చెల్లిస్తాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల 96 శాతం మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. బ్యాంకుల నుంచి రైతులు రుణాలు తీసుకున్నా... ప్రస్తుతం రుణమాఫీ అనే పద ం లేదు. రైతులకు కొత్త రుణాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. -
ఏపీలో రైతులకు సంక్షేమ నిధి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రైతు రుణమాఫీ గురించి చంద్రబాబు దాదాపు 5 గంటల పాటు చర్చించారు. రుణమాఫీ అమలుకు ఎదురవుతున్న సమస్యల గురించి చంద్రబాబు చర్చించారు. రైతులకు 25 రూపాయల ముఖవిలువతో ఒక్కో బాండు జారీ చేయాలని నిర్ణయించినట్టు ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. ఇందుకోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తొలివిడతగా 7 వేల కోట్ల రూపాయలతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి తర్వాత రైతులు బాండ్లను తీసుకెళ్లి కార్పొరేషన్లో డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు. ఇది రుణమాఫీ కాదని రైతులకు ఆర్థిక సాయమేనని సుజనా చౌదరి తెలిపారు. ఖరీఫ్ రుణాల మంజూరుకు గడువు పెంచారు. పాతఅప్పులపై వడ్డీ భారాన్ని రైతులే మోయాలని తెలిపారు. -
మాఫీ కోసం రైతుల వివరాలివ్వండి
బ్యాంకర్లను కోరిన ఆర్థికశాఖ 25లోగా సమాచారమివ్వాలని సూచన సాక్షి, హైదరాబాద్: రైతుల వ్యవసాయ రుణాల మాఫీపై తామడిగిన వివరాలను ఈ నెల 25వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోను అందజేయాల్సిందిగా ఆర్థిక శాఖ బ్యాంకర్లను కోరింది. ఈ అంశంపై శనివారం జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. వ్యవసాయ పంట రుణాలతోపాటు బంగారంపై తీసుకున్న పంట రుణాల మాఫీకి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలనటంతో బ్యాంకర్లకు సమస్యలు తలెత్తుతున్నాయి. బ్యాంకర్ల దగరున్న సమాచారం కాకుండా రైతుల నుంచి ఆధార్, రేషన్ కార్డులను కూడా సేకరించి ఆ వివరాలను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అలాగే రైతుల వ్యవసాయ భూమి విస్తీర్ణంతో పాటు సర్వే నెంబర్లనూ ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొంది. దీంతో బ్యాంకులు రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తూనే మరోవైపు ఇవన్నీ సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. నిజానికి బ్యాంకులు గత నెల్లోనే 17 అంశాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రభుత్వం మరో 14 అంశాలు చేర్చి 31 అంశాలను పంపాలని కోరింది. అది సిద్ధం చేస్తున్న తరుణంలో ఇపుడు మరో మూడంశాలను చేర్చింది. ఇవన్నీ కలిపి ఈ నెల 25లోగా పంపాలని తాజాగా కోరింది. ఇలా ఎప్పటికప్పుడు అంశాలను పెంచుతూ ప్రభుత్వం గడువులిస్తుండటంతో బ్యాంకులు తలలు పట్టుకుంటున్నాయి. పెపైచ్చు ఈ సమాచారమేమీ వారివద్ద సిద్ధంగా ఉన్నది కాదు. రైతుల నుంచి సేకరించాలి. చిన్న చిన్న బ్రాంచులకు కూడా ఐదారువేల ఖాతాలు ఉండటంతో అవన్నీ ఆన్లైన్లో నమోదు చేయటం వారికి తలకు మించిన భారమవుతోంది. దీంతో బ్యాంకులకు వివరాలిచ్చేందుకు రైతులను ప్రోత్సహించి, వారితో బ్యాంకులకు ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులను ఇప్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి లేఖలు కూడా రాశారు. -
బాండ్లు కాదు.. ప్రామిసరీ నోట్లు!
టీ సర్కార్ మరో కొత్త ఆలోచన సాక్షి, హైదరాబాద్: రైతులు రుణాలు చెల్లిస్తే... వారికి రెండు మూడేళ్లలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే విధంగా హామీ పత్రం (పామిసరీ నోట్) ఇవ్వనున్నట్లు సమాచారం. రైతులు బ్యాంకులకు రుణం చెల్లించి ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) తీసుకుని వస్తే.. ప్రభుత్వం ఒక బాండును రైతుకు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇటీవల వెల్లడించిన విషయం విదితమే. అయితే బాండ్లు జారీ చేయడం వల్ల అధికారికంగా అప్పు తెచ్చుకోవడమేనన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. దీంతో రైతులకు బాండ్ల రూపంలో కాకుండా హామీ పత్రం (ప్రామిసరీ నోట్) ఇచ్చే అంశాన్ని తాజాగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండు మూడు సంవత్సరాల్లోగా రైతులకు ఆ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని యోచనలో ఉంది. తగ్గనున్న భారం! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రుణ మాఫీ భారం తగ్గుతోంది. ప్రస్తుతం అంచనా వేసిన రూ. 17,337 కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు తగ్గనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రుణమాఫీ అమలుకు జారీ చేసిన మార్గదర్శకాల తరువాత బ్యాంకర్లు రైతులకు ఇచ్చిన రుణాలపై బ్యాంకుల వారీగా, గ్రామం వారీగా లెక్కల క్రోడీకరణ పనిని ప్రారంభించిన విషయం విదితమే. ఒక రైతుకు మూడు నాలుగు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లు, ఒక కుటుంబంలో ఉన్న అకౌంట్లను పరిశీలిస్తున్న బ్యాంకులు వీటన్నింటినీ ఒకే అకౌంట్‌గా మార్చాలని యోచిస్తున్నారు. ఇలా మార్చిన పక్షంలో ఒక కుటుంబానికి లక్ష రూపాయల వరకే మాఫీ చేయడం వీలవుతుందని, దీంతో ఈ భారం రెండువేల కోట్ల మేరకు తగ్గుతుందని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేటి నుంచి జాబితా సిద్ధం బ్యాంకుల పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి మంగళవారం లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. బుధవారం నుంచి గ్రామాల్లో సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే రుణాలు రీ షెడ్యూల్ చేయడానికి వంద మండలాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. మరో వెయ్యికోట్ల రూపాయలకు వెసులుబాటు కలుగుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతు రుణమాఫీకి సంబంధించి వారం పదిరోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 31వ తేదీలోగా బ్యాంకుల నుంచి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమాచారం వచ్చిన తరువాత ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై.. నిధులు ఏ విధంగా సర్దుబాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.