టీఎమ్మార్పీఎస్ సభను జయప్రదం చేయాలి
Published Sun, Oct 2 2016 10:50 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
మేళ్లచెరువు : ఈ నెల 6న నల్లగొండలో జరిగే టీఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఇన్‌చార్జి చింతబాబు మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన ఆ సంఘం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగల చైతన్య పాదయాత్రలో భాగంగా చెప్పులుకుట్టే వారికి, డబ్బుకొట్టే వారికి నెలకు రూ.2వేల పింఛన్ అందజేయాలని డిమాండ్ చేశారు. అన్ని కుల వృత్తులకు పింఛన్ ఇస్తూ దళితులపై వివక్ష చూపుతూ పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మాదిగలకు పింఛన్ల సాధనకు నవంబర్ 19న హైదరాబాద్‌లో నిర్వహించే జైత్రయాత్ర మహాసభకు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు చడపంగు సైదులు, జిల్లా ప్రచార కార్యదర్శి కృష్ణబాబు, ఆర్.కుటుంబరావు, వీహెచ్‌పీఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము రామయ్య, దేవయ్యమాదిగ, కరుణాకర్, కోటయ్య, సురేష్, దావీదు, సాయిబాబు, శ్రీనివాస్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement