tmrps
-
ఈటల జోలికొస్తే ప్రజలే బుద్ధి చెబుతారు
హైదరాబాద్: అణగారిన కులాల ప్రతినిధి, మంత్రి ఈటల రాజేందర్ జోలికొస్తే రేవంత్‌రెడ్డికి అణగారిన కులాల ప్రజలే బుద్ధి చెబుతారని టీఎంఆర్పీఎస్ ప్రతినిధులు హెచ్చరించారు. శనివారం విద్యానగర్‌లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి పనిగట్టుకొని అణగారిన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ గతంలో కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వీరేశంలను.. ప్రస్తుతం తాజాగా ఈటలను విమర్శించడం జరుగుతోందని అన్నారు. మంత్రి ఈటలను యావత్తు తెలంగాణ అణగారిన వర్గాల ప్రతినిధిగా తాము భావిస్తున్నమన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి మంత్రి ఈటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాదిగ మహిళా సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు ఆకారపు రుక్కమ్మ మాదిగ, రాష్ట్ర అధ్యక్షురాలు బాలమణి మాదిగ, నాయకులు సునీల్ మాదిగ, కొల్లూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
టీఎమ్మార్పీఎస్ సభను జయప్రదం చేయాలి
మేళ్లచెరువు : ఈ నెల 6న నల్లగొండలో జరిగే టీఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఇన్చార్జి చింతబాబు మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన ఆ సంఘం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగల చైతన్య పాదయాత్రలో భాగంగా చెప్పులుకుట్టే వారికి, డబ్బుకొట్టే వారికి నెలకు రూ.2వేల పింఛన్ అందజేయాలని డిమాండ్ చేశారు. అన్ని కుల వృత్తులకు పింఛన్ ఇస్తూ దళితులపై వివక్ష చూపుతూ పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మాదిగలకు పింఛన్ల సాధనకు నవంబర్ 19న హైదరాబాద్‌లో నిర్వహించే జైత్రయాత్ర మహాసభకు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు చడపంగు సైదులు, జిల్లా ప్రచార కార్యదర్శి కృష్ణబాబు, ఆర్.కుటుంబరావు, వీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము రామయ్య, దేవయ్యమాదిగ, కరుణాకర్, కోటయ్య, సురేష్, దావీదు, సాయిబాబు, శ్రీనివాస్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
చెప్పు, డప్పు వృత్తిదారులకు పింఛన్ ఇవ్వాలి
మునగాల : తెలంగాణలో చెప్పు, డప్పును నమ్ముకునే వృత్తిదారులకు నెలకు రూ.రెండు వేల పింఛన్ ఇవ్వాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఏబీసీడీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని టీఎమ్మారీయస్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఆదివారం రాత్రి మునగాలకు చేరుకొని స్థానిక గ్రంథాలయ శాఖ భవనంలో బసచేసింది. కాగా సోమవారం ఉదయం మునగాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మండల శాఖ అధ్యక్షుడు ఎల్.శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఈనెల 18న జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం కొలనుపాక నుంచి ప్రారంభమైన పాదయాత్ర నవంబర్ 18న హైదరాబాద్‌లో ముగుస్తుందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే టీఎమ్మార్పీయస్ సన్నాహక సదస్సుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్.మోహన్‌రావు, టీఎమ్మార్పీయస్ జిల్లా ఇన్చార్జి చింతా బాబు మాదిగ, నియోజక వర్గ ఇన్చార్జి అమరారపు శ్రీను, మండల పార్టీ కార్యదర్శి ఎల్.నాగబాబు పాల్గొన్నారు. -
మాదిగ ఉపకులాల అభివృద్ధికే పాదయాత్ర
అర్వపల్లి : మాదిగ ఉపకులాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన టీఎమ్మార్పీఎస్ జిల్లా విస్త్రత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 10న ఆలేరు మండలం కొలనుపాకలో టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. చెప్పులుకుట్టె చర్మకారులు, డప్పులుకొట్టే కళాకారులకు నెలకు రూ. 2వేలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించుటకు నెల రోజుల పాటు టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడామని చెప్పారు. వర్గీకరణకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో జిల్లా ఇన్చార్జి చింత బాలు, జిల్లా పర్యవేక్షకులు బాకి పాపయ్య, తప్పెట్ల శ్రీరాములు, కందూకూరి ప్రవీణ్‌మాదిగ, భాషపంగు భాస్కర్, బొర్ర ఈదయ్య, పంది ధనుంజయ్, యాతాకుల సునిల్, ఈదుల అర్వపల్లి, బుషిపాక ఉదయ్, తలారి సునిల్, సీహెచ్. గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ
నాగర్‌కర్నూల్‌రూరల్ : రాష్ట్రంలో పేదలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ అన్నారు. గురువారం పీఆర్ అతిథిగహంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సకల జనుల సమ్మెలో దళితులు ఎంతో కషిచేశారని, డప్పు నత్యాలతో ఉద్యమంలో పాల్గొన్నారని, రాష్ట్రం ఏర్పడితే దళితుల బతుకులు బాగుపడతాయని ఆశించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దళిత సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం రావాల్సిన బడ్జెట్లో దళితుల వాటా సక్రమంగా రావాలన్నారు. సెప్టెంబర్ 10నుంచి 70రోజులపాటు ఆత్మగౌరవంతో బతుకుదాం, హక్కులు సాధించుకుందామన్న నినాదంతో బస్సు యాత్ర చేపడుతున్నామని అన్నారు. సమావేశంలో టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నయ్య, కార్యదర్శులు జయశంకర్, మల్లెపోగు శ్రీను, రాష్ట్ర నాయకులు మొలకలపల్లి నర్సింహ, శ్యామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ఆనంద్, మహిళా అధ్యక్షురాలు నిరంజనమ్మ, పాలకొండ కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
టీఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ ఎన్నిక
ఆదిలాబాద్ : తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(టీఎమ్మార్పీఎస్) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో టీఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మాదిగ మహిళా జాతీయ అధ్యక్షురాలు పెబ్బే జీవామాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య, తెలంగాణ మాదిగ మహిళా అధ్యక్షురాలు మిట్టపల్లి విజయల మాదిగ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా మల్యాల మనోజ్, అధికార ప్రతినిధిగా నక్క రాందాస్, జిల్లా ఉపాధ్యక్షులుగా చందెల బందెన్న, సుంకె రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామెల్లి సంటెన్న, జిల్లా కార్యదర్శులుగా మల్యాల కరుణాకర్, బిక్కి విలాస్, కోశాధికారిగా లింగంపల్లి ప్రసన్నకుమార్, సంయుక్త కార్యదర్శిగా రవికుమార్, సహాయ కార్యదర్శులుగా కంపెల్లి అనిల్, నరేష్, జిల్లా కమిటీ సభ్యులుగా సిందే సంజయ్, పెదెల్లి మహేందర్, భట్లాడే విఠల్, సుదర్శన్ ఎన్నికయ్యారు.