మాదిగ ఉపకులాల అభివృద్ధికే పాదయాత్ర | march for sc sub castes development | Sakshi
Sakshi News home page

మాదిగ ఉపకులాల అభివృద్ధికే పాదయాత్ర

Published Fri, Aug 26 2016 7:33 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

మాదిగ ఉపకులాల అభివృద్ధికే పాదయాత్ర - Sakshi

మాదిగ ఉపకులాల అభివృద్ధికే పాదయాత్ర

అర్వపల్లి : మాదిగ ఉపకులాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన టీఎమ్మార్పీఎస్‌ జిల్లా విస్త్రత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 10న ఆలేరు మండలం కొలనుపాకలో టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. చెప్పులుకుట్టె చర్మకారులు, డప్పులుకొట్టే కళాకారులకు నెలకు రూ. 2వేలు పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించుటకు నెల రోజుల పాటు టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడామని చెప్పారు. వర్గీకరణకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈసమావేశంలో జిల్లా ఇన్‌చార్జి చింత బాలు, జిల్లా పర్యవేక్షకులు బాకి పాపయ్య, తప్పెట్ల శ్రీరాములు, కందూకూరి ప్రవీణ్‌మాదిగ, భాషపంగు భాస్కర్, బొర్ర ఈదయ్య, పంది ధనుంజయ్, యాతాకుల సునిల్, ఈదుల అర్వపల్లి, బుషిపాక ఉదయ్, తలారి సునిల్, సీహెచ్‌. గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement