సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి ఈనెల 19న శివరాంపల్లిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి భానుప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఆరు స్టాఫ్‌నర్స్, నాలుగు ఫా ర్మాసిస్టు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్, నాలు గు ఏఎన్‌ఎం, మూడు అకౌంటెంట్ పో స్టులు భర్తీ చేస్తామన్నారు. తాత్కాలికం గా ఎంపికైన వారి వివరాలు జిల్లా వెబ్‌సైట్లో పెట్టామన్నారు. ఆయా అభ్యర్థులు ఉదయం 11 గంటలకల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అన్ని ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలతో హాజరు కావాలన్నారు.