నేడు డయల్ యువర్ కలెక్టర్, మీకోసం
Published Sun, Mar 26 2017 11:47 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ముగియడంతో నేటి సోమవారం నుంచి మీకోసం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలు యదావిధిగా నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్, తర్వాత సునయన ఆడిటోరియంలో మీ కోసం కార్యక్రమాలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 08518- 277100కు పోన్ చేసి సమస్యలను చెప్పవచ్చని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement