నేడు న్యాయవాద సంఘ కార్యవర్గ ఎన్నికలు | today lawyers association elections | Sakshi
Sakshi News home page

నేడు న్యాయవాద సంఘ కార్యవర్గ ఎన్నికలు

Published Thu, Sep 15 2016 9:05 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

today lawyers association elections

కర్నూలు(లీగల్‌): కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం కార్యవర్గ ఎన్నికకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి, న్యాయవాది ఎన్‌.నారాయణరెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. మూడు పదవులకు అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నందున పోలింగ్‌ అనివార్యమైందన్నారు. అసోసియేషన్‌ అధ్యక్ష పదవికి ఎస్‌.చాంద్‌బాషా, సుబ్బయ్యలు పోటీ పడుతుండగా.. ఉపాధ్యక్ష స్థానానికి అనిల్‌కుమార్, దేవప్రసాద్‌లు బరిలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి సి.వి.శ్రీనివాసులు, జయలక్ష్మిదేవి మధ్య పోటీ ఉంది. మహిళా ప్రతినిధి స్థానానికి ఎం.సుమలత, బి.గీతామాధురి, వరలక్ష్మిలు పోటీ పడుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement