-
పదహారు తండాల్లో ఒకేసారి గోధుమనారు బతుకమ్మల నిమజ్జనం
మహబూబాబాద్ రూరల్ : లంబాడ గిరిజనుల తీజ్ పండుగ ఆదివారం నిర్వహించనున్నట్లు శనిగపురం గ్రామ సర్పంచ్ గుగులోత్ రాజునాయక్ తెలిపారు. శనిగపురం శివారు పదహారు తండాల్లో ఒకేసారి ప్రారంభమైన తీజ్ ఉత్సవాల్లో భాగంగా ఆఖరు రోజున గోధుమ నారు బతుకమ్మలను ఊర చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
ఈవిషయమై గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం సమావేశమయ్యారు. పదహారు తండాల యువతులు సంప్రదాయ వేషధారణలో బతుకమ్మలతో వచ్చి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ వెంకన్ననాయక్, సంఘం రాష్ట్ర ఉపా««దl్యక్షుడు ధరావత్ మోతీలాల్‌నాయక్, వార్డు సభ్యులు నరేష్, రమేష్, లక్ష్మణ్, హరి, దేవ్‌సింగ్, బానోత్ రాము, లింగన్న, సత్యం, బావుసింగ్, మోహన్, రమేష్, హత్తిరామ్, రవి, భద్రు, కిరణ్, కిషన్, బిక్షం, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గుగులోత్ రాములునాయక్ పాల్గొన్నారు.
శనిగపురం శివారు బోరింగ్‌తండాలో తీజ్ వేడుకలు శనివారం ఎనిమిదో రోజుకు చేరాయి. లంబాడ యువతులు గోధుమ నారు బుట్టలు పెట్టిన వేదిక వద్ద పూజ లు చేశారు. వార్డు సభ్యుడు బానోత్ నరేష్, వీరన్ననాయక్, భాస్కర్, మోహన్, భద్రు, సంతోష్, వీరేందర్, శిరీష, స్వాతి, స్వప్న, సరిత, కవిత పాల్గొన్నారు.
గూడూరు : లంబాడ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక తీజ్ ఉత్సవాలని మాజీ ఎంపీపీ నూనావత్ రమేష్‌నాయక్, సర్పంచ్ వాంకుడోతు మోతీలాల్‌నాయక్ అన్నారు. మండలకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో తీజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన వేడుకలు శనివారం ఐదో రోజుకు చేరాయి. యువతులు, సాధువులు డప్పుచప్పుళ్లు, నృత్యాల మధ్య గంగాజలాన్ని తీసుకువచ్చి బొరడి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకుడు వాంకుడోతు భరత్‌నాయక్, సాధువులు వాల్యానంద, కిషన్, మాలు, రూపా, పూల్యా, సురేష్, రామన్న, కఠార్‌సింగ్, లక్ష్మణ్, మోహన్, వెంకన్న, చందూలాల్, ప్రశాంత్, ధార్మా, బాలూ, వీరన్ననాయక్, విద్యార్థులు మౌనిక, హారిక, స్వామి, మమత, రాధిక, అంజలి పాల్గొన్నారు.