అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 2న జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోంది. ఈనెల 2న ఉదయం పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు హంద్రీ–నీవా నీటిని విడుదల చేస్తారు. అక్కడే గంగపూజ నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మడకశిర చేరుకుంటారు. స్వయం సహాయక సంఘాలతో సమావేశం అనంతరం ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమంలో పాల్గొంటారు.