‘యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి’ | congress visits gollapalli reservoir | Sakshi
Sakshi News home page

‘యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి’

Published Sun, Oct 30 2016 1:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress visits gollapalli reservoir

పెనుకొండ రూరల్‌ : హంద్రీ–నీవా పనులు నత్తనడకన సాగుతున్నాయని, యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఓపీడీఆర్‌ రాష్ట్ర జలసాధన సమితి అధ్యక్షులు శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ను హంద్రీనీవా ఈఈ రామకృష్ణారెడ్డితో కలిసి జలసాధన సమితి సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన జిల్లా అయిన అనంతపురంలో కరువు విలాయతాండవం చేస్తోందని, ఈ జిల్లాను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా పనులు త్వరితగతిన పూర్తి చేసి పెనుకొండ మీదుగా సోమందేపల్లి, హిందూపురం, పరిగి, మడకశిరకు నీళ్లు వదలాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, జలసాధన సమితి సభ్యులు ఇందాద్, శ్రీరాములు, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement