రేపు స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం | tomorrow women inspiration meet | Sakshi

రేపు స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం

Nov 14 2016 12:00 AM | Updated on Sep 4 2017 8:01 PM

నగర శివారులోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఈ నెల 15వతేదీ ఉదయం 9 గంటలకు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలతో ‘స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌ సత్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

- ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ రాక
కర్నూలు(అర్బన్‌):  నగర శివారులోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఈ నెల 15వతేదీ ఉదయం 9 గంటలకు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలతో ‘స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌ సత్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని పొదుపు మహిళలు(కనీస విద్యార్హత 10వ తరగతి, వయసు 40 సంవత్సరాలు లోబడి) తప్పక హాజరు కావాలన్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఓబీఎంఎంఎస్‌పై అవగాహన ...
ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 2 గంటలకు ఇదే హాల్‌లో ఓబీఎంఎంఎస్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సత్యం చెప్పారు. సదస్సుకు ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్లు, అన్ని కార్పొరేషన్లకు చెందిన కార్యనిర్వాహక సంచాలకులు, బ్యాంకు కంట్రోలర్స్, రీజినల్‌ మేనేజర్లు, బ్యాంకు మేనేజర్లు హాజరు కావాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement