podupu
-
140 పొదుపు గ్రూపులపై కేసుల నమోదు
– ఇందులో 10 గ్రూపు లీడర్ల ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం – బ్యాంకర్ల సమావేశంలో వెల్లడి – ఇంత జరుగుతుంటే తన దృష్టికి ఎందుకు తీసుకోరాలేదని ఐకేపీ సిబ్బందిపై పీడీ ఆగ్రహం ఆళ్లగడ్డ: చాగలమర్రి మండలంలో పొదుపు రుణాలు తీసుకుని చెల్లించని 140 డ్వాక్రా సంఘాలపై కేసులు నమోదు చేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో మంగళవారం ఆళ్లగడ్డ డివిజన్ జాయింట్ మండల్ లెవల్ బ్యాంకర్ల సమావేశం జరిగింది. డీఆర్డీఏ పీడీ, ఎల్డీఎం, వివిధ కారొ్పరేషన్ల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగలమర్రి ఎస్బీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతూ రుణాలు సక్రమంగా చెల్లించని 140 గ్రూపులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఇందులో 10 సంఘాల సభ్యుల ఆస్తులు అప్పులోకి జప్తు చేసేకునేందుకు రంగం సిద్ధం చేశామని వెల్లడించారు. సిబ్బందిపై డీఆర్డీఏ పీడీ ఆగ్రహం పొదుపు సంఘాలపై కేసుల నమోదు విషయం తన దృష్టికి ఎందుకు తీసుకోరాలేదని డీఆర్డీఏ పీడీ రామకృష్ణ ఐకేపీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేక పోతే ఎలా ప్రశ్నించారు. రుణాలు చెల్లించేలా సంఘాలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్డీఎం నరసింహులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, శిరివెళ్ల, గోస్పాడు మండలాల ఎంపీడీఓలు, బ్యాంకర్లు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు -
రేపు స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం
- ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ రాక కర్నూలు(అర్బన్): నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 15వతేదీ ఉదయం 9 గంటలకు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలతో ‘స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్ సత్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని పొదుపు మహిళలు(కనీస విద్యార్హత 10వ తరగతి, వయసు 40 సంవత్సరాలు లోబడి) తప్పక హాజరు కావాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓబీఎంఎంఎస్పై అవగాహన ... ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 2 గంటలకు ఇదే హాల్లో ఓబీఎంఎంఎస్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సత్యం చెప్పారు. సదస్సుకు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు, అన్ని కార్పొరేషన్లకు చెందిన కార్యనిర్వాహక సంచాలకులు, బ్యాంకు కంట్రోలర్స్, రీజినల్ మేనేజర్లు, బ్యాంకు మేనేజర్లు హాజరు కావాలన్నారు. -
పొదుపు మహిళల అభివృద్ధి ప్రశంసనీయం
– శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ ఓర్వకల్లు: పొదుపు సంఘాల ద్వారా మహిళలు సాధించిన అభివృద్ధి ప్రశంసనీయమని శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించారు. మహిళలు ఆయనకు సాధరంగా స్వాగతం పలికారు. అనంతరం సమాఖ్య వ్యవస్థాపకురాలు విజయభారతితో పొదుపు సంఘాల ఏర్పాటు, మహిళల పనితీరుపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా విజయభారతి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక ఎదుగుదలకు సంఘాలు ఎంతో తోడ్పాటు అందించాయన్నారు. గత 22 సంవత్సరాల్లో సుమారు 10వేల మంది మహిళలు సంఘాలలో చేరి ఆర్థికంగా బలోపేతం అయ్యారన్నారు. ఇప్పటి వరకు మండలంలోని 920 మహిళా సంఘాల ద్వారా సుమారు రూ.70 కోట్లు టర్నోవర్ చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ చైర్మన్ చక్రపాణియాదవ్ మాట్లాడుతూ.. పొదుపు సంఘాల ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఓర్వకల్లు మండలానికి మంచి గుర్తింపు లభించిందన్నారు. మహిళల విజయగాథను చూస్తుంటే తాను ఈ మండలంలో జన్మించడమే గర్వంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఓర్వకల్లుకు మంచిరోజులు రావాలని, మహిళలు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.