140 పొదుపు గ్రూపులపై కేసుల నమోదు
140 పొదుపు గ్రూపులపై కేసుల నమోదు
Published Tue, Feb 7 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
– ఇందులో 10 గ్రూపు లీడర్ల
ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం
– బ్యాంకర్ల సమావేశంలో వెల్లడి
– ఇంత జరుగుతుంటే తన దృష్టికి
ఎందుకు తీసుకోరాలేదని ఐకేపీ సిబ్బందిపై పీడీ ఆగ్రహం
ఆళ్లగడ్డ: చాగలమర్రి మండలంలో పొదుపు రుణాలు తీసుకుని చెల్లించని 140 డ్వాక్రా సంఘాలపై కేసులు నమోదు చేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో మంగళవారం ఆళ్లగడ్డ డివిజన్ జాయింట్ మండల్ లెవల్ బ్యాంకర్ల సమావేశం జరిగింది. డీఆర్‌డీఏ పీడీ, ఎల్‌డీఎం, వివిధ కారొ్పరేషన్ల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగలమర్రి ఎస్‌బీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతూ రుణాలు సక్రమంగా చెల్లించని 140 గ్రూపులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఇందులో 10 సంఘాల సభ్యుల ఆస్తులు అప్పులోకి జప్తు చేసేకునేందుకు రంగం సిద్ధం చేశామని వెల్లడించారు.
సిబ్బందిపై డీఆర్‌డీఏ పీడీ ఆగ్రహం
పొదుపు సంఘాలపై కేసుల నమోదు విషయం తన దృష్టికి ఎందుకు తీసుకోరాలేదని డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ ఐకేపీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేక పోతే ఎలా ప్రశ్నించారు. రుణాలు చెల్లించేలా సంఘాలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం నరసింహులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, శిరివెళ్ల, గోస్పాడు మండలాల ఎంపీడీఓలు, బ్యాంకర్లు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు
Advertisement
Advertisement