పొదుపు మహిళల అభివృద్ధి ప్రశంసనీయం
పొదుపు మహిళల అభివృద్ధి ప్రశంసనీయం
Published Mon, Sep 26 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
– శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్
ఓర్వకల్లు: పొదుపు సంఘాల ద్వారా మహిళలు సాధించిన అభివృద్ధి ప్రశంసనీయమని శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించారు. మహిళలు ఆయనకు సాధరంగా స్వాగతం పలికారు. అనంతరం సమాఖ్య వ్యవస్థాపకురాలు విజయభారతితో పొదుపు సంఘాల ఏర్పాటు, మహిళల పనితీరుపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా విజయభారతి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక ఎదుగుదలకు సంఘాలు ఎంతో తోడ్పాటు అందించాయన్నారు. గత 22 సంవత్సరాల్లో సుమారు 10వేల మంది మహిళలు సంఘాలలో చేరి ఆర్థికంగా బలోపేతం అయ్యారన్నారు. ఇప్పటి వరకు మండలంలోని 920 మహిళా సంఘాల ద్వారా సుమారు రూ.70 కోట్లు టర్నోవర్ చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ చైర్మన్ చక్రపాణియాదవ్ మాట్లాడుతూ.. పొదుపు సంఘాల ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఓర్వకల్లు మండలానికి మంచి గుర్తింపు లభించిందన్నారు. మహిళల విజయగాథను చూస్తుంటే తాను ఈ మండలంలో జన్మించడమే గర్వంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఓర్వకల్లుకు మంచిరోజులు రావాలని, మహిళలు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Advertisement