హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ సీజ్
హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ సీజ్
Published Mon, May 22 2017 11:16 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
– అదుపులో ఇద్దరు వ్యక్తులు
కృష్ణగిరి: వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడులను హతమార్చేందుకు వినియోగించిన ఏ1 నిందితుడు చెరుకులపాడుకు చెందిన కురువ రామాంజనేయులు ట్రాక్టర్‌ను సోమవారం తెల్లవారుజామున రామకృష్ణాపురం సమీపంలో పట్టుకున్నట్లు ఎస్‌ఐ సోమ్లానాయక్ తెలిపారు. ముందస్తు సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామని, అయితే ఈ ట్రాక్టర్‌పై ఎరుకలచెర్వుకు చెందిన చంద్ర, చెరుకులపాడుకు చెందిన పెద్దయ్య వస్తున్నారని.. అనుమానంతో వీరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ ట్రాక్టర్‌కు ఎలాంటి నెంబర్ లేకపోగా.. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయించనట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ ముందు భాగం వాహనాన్ని ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హత్యలకు ఉపయోగించిన మరో ట్రాక్టర్‌ను పట్టుకోవాల్సి ఉంది.
Advertisement
Advertisement