డబ్బులే డబ్బులు!
♦ గ్రేడ్‌లెసైన్స్ ద్వారా వికారాబాద్
♦ మున్సిపాలిటీకి రూ.6లక్షల ఆదాయం
♦ పట్టణంలోని వ్యాపార సముదాయలు 991
♦ పూర్తిస్థాయిలో వృత్తిపన్ను వసూలు
వికారాబాద్: వికారాబాద్ మున్సిపాలిటీ 1987లో ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నడూ వ్యాపారుల నుంచి ట్రేడ్ లెసైన్సులు పూర్తిస్థాయిలో వసూలు చేయలేదు. మున్సిపాలిటీని ఏర్పాటు చేసినప్పుడు వ్యాపార సముదాయాలు కూడా తక్కువగా ఉండేవి. వాటి నుంచి పన్నులు వసూలు చేయాలన్న నిబంధన ఉన్నా అధికారుల పట్టించుకోలేదు. ఈ యేడాది ఆ పన్ను పూర్తిస్థాయిలో వసూ లు చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీం తో మున్సిపాలిటీకి ఆరు లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. వికారాబాద్ మున్సిపాలిటీ గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగింది. ఆ తర్వాత 1987లో పురపాకల సంఘంగా మారింది. ఈ నేపథ్యంలో అప్పట్లో చిరు వ్యాపారులతో పాటు పెద్ద వ్యాపారస్తులు, వివిధ వృత్తుల వారు విక్రయాలు జరిపేవారు.
అప్పట్లో కొందరు మున్సిపల్ యంత్రాంగం ట్రెడ్ లెసైన్స్‌ను వసూల్ చేయకుండా చేతివాటం ప్రదర్శించడంతో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఆగిపోయింది. అప్పటి నుంచి గత ఏడాది వరకు ట్రెడ్‌లెసైన్స్ ద్వారా పన్ను వసూలును మున్సిపల్ యంత్రాంగం పూర్తిస్థాయిలో విస్మరించింద నే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది వరకు వివిధ వ్యాపారస్తులనుంచి అరకొరగా పన్ను వసూల్ చేస్తూ మిగతా డబ్బులను సిబ్బంది జేబుల్లో వేసుకునే వారనే విమర్శలున్నాయి. పట్టణంలో కార్మిక కార్యాలయం లెక్కల ప్రకారం వ్యాపార సముదాయలు రమారమి 1500 వరకు ఉన్నాయి.
అయితే, మున్సిపల్ యంత్రాంగం మాత్రం 991వరకే ఉన్నాయని చెప్పింది. వీటికి సంబంధించి ఈ ఏడాది రూ.500 నుంచి రూ.2,500 వరకు ట్రెడ్ లెసైన్స్ కింద పన్ను వసూ లు చేశారు. దీంతో రూ.6 లక్షల వరకు పన్నులు రూపేణా వచ్చినట్టు మున్సిపల్ యంత్రాంగం పేర్కొంటోంది. కాకపోతే పట్టణ విస్తీర్ణంతోపాటు జనాభా పెరగడంతో వ్యాపార సముదాయలు సైతం పెరిగాయి. కానీ, ట్రైడ్‌లెసైన్స్ ఫీజు మాత్రం పెంచలేదు. తాండూరు మున్సిపాలిటీలో వసూలుచేస్తున్న ట్రెడ్ లెసైన్స్ పన్ను సుమారుగా రూ.1000 నుంచి రూ.50వేల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే ట్రెడ్ లెసైన్స్ ఫీజును మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టి పాత రేట్లను సవరించి కొత్తవి నిర్ణయిస్తూ తీర్మానం చేయాలి. దీనిని అమలు చేస్తే మున్సిపాలిటీకి భారీగా ఆదాయం వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.