కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్‌ బస్సు | travel bus drowned in canal | Sakshi
Sakshi News home page

కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్‌ బస్సు

Published Mon, Oct 3 2016 2:15 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్‌ బస్సు - Sakshi

కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్‌ బస్సు

తణుకు : తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో ఆదివారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బస్‌షెల్టర్‌ను ఢీకొట్టి సమీపంలోని కాలువలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డా రు. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం.. విశాఖ నుంచి నరసరావుపేట వెళుతున్న ఏపీ 16 టీహెచ్‌ 4445 నంబర్‌ గల వీబీ ఆర్‌ ట్రావెల్స్‌ బస్సు తేతలి వద్ద బస్‌షెల్టర్‌ను ఢీకొట్టి  16వ నంబర్‌ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అత్తిలి కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వేకువజాము 4 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్‌ సజ్జ విజయకుమార్‌ నిద్రమత్తు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు. రోడ్డు పక్కన బస్‌ షెల్టర్‌ను ఢీకొట్టడంతో వేగం తగ్గిన బస్సు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. అప్పటికే ప్రయాణికులకు మెలకువ రావడంతో అంతా అప్రమత్తమయ్యా రు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామ సర్పంచ్‌ కోట నాగేశ్వరరావు గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న బాధితులను ఒడ్డుకు చేర్చారు. బస్సులోంచి బయట పడేందుకు అద్దాలు పగులకొట్టడంతో కొందరికి స్వల్పగాయాలయ్యాయి. 
 
ఆరు గంటల పాటు శ్రమించిన సిబ్బంది
వివిధ శాఖల అధికారులు హుటాహుటిన సం ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువలో పూ ర్తిగా నీట మునిగిన బస్సును ఒడ్డుకు చేర్చేం దుకు పోలీసు, రవాణా, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. రెండు క్రేన్లు తీసుకువచ్చి బస్సు ను బయటకు తీయడానికి ప్రయత్నించినా సా ధ్యం కాకపోవడంతో రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌ రావులపాలెం నుంచి భారీ క్రేన్‌ రప్పించారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, సీఐ సీహెచ్‌ రాంబాబు, తహసీల్దార్‌ సత్యవతి, అగ్నిమాపక అధికారి ఏసుబాబు, ఎస్సైలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. 
 
డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే..
బస్సు డ్రైవర్‌ సజ్జ విజయకుమార్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసు, రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. శనివారం రా త్రి 10 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి నరసారావుపేటకు బస్సు బయలుదేరింది. బస్సు లో ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సి ఉండగా విశాఖలో  ఎక్కిన డ్రైవర్‌ రాజమండ్రిలో మారాడు. రాజ మండ్రిలో సజ్జ విజయ్‌కుమార్‌ బస్సు ఎక్కినప్ప టి నుంచి డ్రైవింగ్‌లో తేడా ఉందని ప్రయాణికు లు అంటున్నారు. ప్రమాదానికి సుమారు పావుగంట ముందు టీ తాగేందుకు డ్రైవర్‌ బస్సు ఆ పాడని, దీంతో ప్రయాణికులు మెలకువగా ఉన్న ట్టు తెలుస్తోంది. ప్రయాణికులు నిద్రమత్తులో ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని భావిస్తున్నా రు. ఇటీవల కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సుమారు 3 అడుగుల మేర కాలువ నీరు తగ్గింది. దీంతో కాలువ ఒడి లేకపోవడంతోనే ప్రాణనష్టం తప్పిందని స్థానికులు అంటున్నారు.  
 
కొట్టుకుపోయిన లగేజీ
ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు వచ్చిన ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న లగేజీను బస్సులోనే వదిలేశారు. విలువైన పత్రాలు, సర్టిఫికెట్లు, నగలు ఉండటంతో ప్రయాణికులు బస్సును కాలువలో నుంచి బయటకు తీసేవరకు ఆందోళనతో గడిపారు. కొంతమంది లగేజీ భద్రంగానే ఉన్నా విలువైన పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు నీళ్లలో నానిపోయాయి. మరికొందరి లగేజీ కాలువలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదం జరిగిన సమయం లో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఎలక్రీ్టషియన్లు ప్రయాణికులను బయటకు తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. తమ వద్ద బ్యాగుల్లో తెచ్చుకున్న సుత్తులు, ఇతర పరికరాలతో అద్దాలను పగులగొట్టారు. 
 
పాపను రక్షించుకున్నా..
నరసారావుపేట వెళ్లేందుకు విశాఖలో బ స్సు ఎక్కాను. నా రెండేళ్ల పాపతో కిటికీ పక్కనే కూ ర్చున్నా.  బస్‌షెల్టర్‌ను బస్సు ఢీకొట్టడంతో కుదుపునకు మెలకువ వచ్చింది. తేరుకునేలోపు నీళ్లలో ఉన్నాం. ఏ జరుగుతుందో తెలియదు. నేను పీకల్లోతు నీళ్లలో మునిగిపోవడంతో పాపను తలపై పెట్టి రక్షించుకున్నా. 
– లక్ష్మీప్రియ, ప్రయాణికురాలు
 
రెండుసార్లు భయపడ్డాం
గుంటూరు వెళ్లేం దుకు విశాఖలో బస్సు ఎ క్కాను. రాజమండ్రి దా టాక రెండు సార్లు సడెన్‌ బ్రేకులు వేయడంతో భయపడ్డాం. ప్రమాదానికి ముందు కొద్దిసేపు టీ తాగేందుకు డ్రైవర్‌ బస్సు ఆపాడు. దీంతో మెలకువగా ఉన్నాం. ప్రమాదాన్ని పసిగట్టి ప్రాణాలు దక్కించుకున్నాం.
– వసంత, ప్రయాణికురాలు
 
సుత్తులతో పగులగొట్టాం
నాతోపాటు ఇద్దరు మిత్రులు ఎలక్రీ్టషియన్‌ పనులు చేసుకుంటూ ఉం టాం. ఏలూరులో పనులు చేసుకునేందుకు విశాఖలో బస్సు ఎక్కాం. ప్రమాదం జరిగిన వెంటనే మావద్ద ఉన్న సుత్తులు, పరికరాలతో అదా ్దలు పగులగొట్టి ప్రయాణికులను రక్షించాం.
– రమేష్, ప్రయాణికుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement