ర్యాలీ నిర్వహిస్తున్న ఆదివాసీలు
-
ఉట్నూర్‌లో భారీ ర్యాలీ
-
బహిరంగ సభ
ఉట్నూర్ రూరల్ : మండల కేంద్రమైన ఉట్నూర్‌లో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్ ప్రాంగణం వద్దకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ఆదివాసీలు కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంప్రదాయ వాయిద్యాలతో నత్యం చేశారు. అనంతరం కేబీ కాంప్లెక్స్ నుంచి పాత బస్టాండ్ మీదుగా ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వమించారు. ఆదివాసీ నాయకులతోపాటు ఆదివాసీలు ఐటీడీఏ ఏపీఓ(జనరల్) కుంరం నాగోరావు, ఐటీడీఏ పరిపాలన అధికారి పెందూర్ భీంలకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఆదివాసీల హక్కులను కాపాడుకోవాలి..
ఆదివాసీల హక్కులను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆదివాసీ నాయకులు అన్నారు. స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదివాసీ నాయకులు మాట్లాడారు. ముఖ్య అథితిగా ఏపీఓ(జనరల్) నాగోరావు, ఐటీడీఏ పరిపాలన అధికారి పెందూర్ భీం హాజరయ్యారు. ఆదివాసీల సంక్షేమం కోసం తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ పీసా, అటవీ హక్కుల చట్టం, జీఓ 3లను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.
కంపా చట్టాన్ని రద్దు చేయాలని, ఐటీడీఏ యాక్షన్ ప్లాన్ అమలు చేయడానికి ఆదివాసీలకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదివాసీ నిరుద్యోగులకు ఉపాది కల్పించాలని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సెలవుదినంగా ప్రకటించాలని, అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. సభలో ఆదివాసీ యువతుల సాంస్కతిక నత్యాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం ఐక్య కార్యాచరణ సమితి జిల్లా అధ్యక్షుడు కనక యాదవ్‌రావు, రాయిసెంటర్ల కార్యదర్శి తొడసం దేవురావు, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుంర సాయికష్ణ, కొలాం విద్యార్థి సంఘం అధ్యక్షుడు సిడాం గంగాధర్, నాయకులు కుడిమెత తిరుపతి, పంద్ర జైవంత్‌రావు, మర్సుకోల తిరుపతి, గిరిజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సిడాం శంభు, ఆత్రం భుజంగ్‌రావు, ఆత్రం రవీందర్, కుంర వినాయక్‌రావు, వెడ్మ భొజ్జు, కనక లక్కేరావు, కుడిమెత మధు, కనక సుగుణ, మర్సుకోల సరస్వతి, లింగధరి కోయ జిల్లా అధ్యక్షుడు జోడి దివాకర్, వెంకటేశ్వర్లు, వివిధ మండలాల నుంచి ఆదివాసీ గిరిజనులు, గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.