హన్మకొండ: ఖమ్మం జిల్లా ఎర్రుపాలం మండలం రెమిడిచర్ల ఎంపీటీసీ సభ్యుడు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కాపు వరప్రసాదరావు టీఆర్‌ఎస్‌ను వీడి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం వరంగల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.
పార్టీలో చేరిన కాపు వరప్రసాదరావును షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి టి.నర్సిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ కె.నగేష్, పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీలో చేరిన టీఆర్‌ఎస్ నేత
Published Wed, Aug 26 2015 10:43 PM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM
Advertisement
Advertisement