join to ysrcp
-
భూమా అఖిలప్రియకు మరో ఎదురుదెబ్బ
ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా): నియోజకవర్గంలో మాజీ మంత్రి అఖిలప్రియకు రాజకీయంగా మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా భూమా వర్గంలో ఉంటూ చాగలమర్రి మండలంలో బాసటగా నిలుస్తూ వచ్చిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామగురివిరెడ్డితో పాటు చిన్నవంగలి పంచాయతీ సర్పంచ్ సయ్యద్‌వలి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వీరితో పాటు వెంకటరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బికారిసాహెబ్, రాజు, డల్లె షరీఫ్, పీరాం సాహెబ్, చిన్న ఇమాంసా, అల్లాబకాష్, పద్మకుమార్‌రెడ్డి తదితర భూమా వర్గం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడం గమనార్హం. వీరిని ఆదివారం ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి సాదరంగా పారీ్టలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిన్నవంగలి లక్ష్మీరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, కొండారెడ్డి, చాగలమర్రి మండల నాయకులు బాబులాల్, కుమార్‌రెడ్డి, రమణ, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు భూమా కోట బద్దలు భూమా కుటుంబానికి చాగలమర్రి మండలం సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా అండగా ఉంటూ వచ్చింది. వారు ఏ పారీ్టలో ఉన్నా చాగలమర్రి మండల నాయకులు మాత్రం వారి వెంటే నడుస్తూ ప్రతి ఎన్నికల్లో బాసటగా నిలిచారు. అలాంటి మండలంలో నేడు భూమా వర్గానికి చెందిన దాదాపు నాయకులందరూ గంగుల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం విశేషం. ఇప్పటికే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో భూమా వర్గం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం పరిషత్ ఎన్నికల్లోనైనా పరువు దక్కించుకోవాలని భావించారు. కానీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం, ఇదే తరుణంలో అఖిలప్రియ కూడా పోటీలో నిలిచిన అభ్యర్థులకు అందుబాటులో లేకపోవడం వారిని అసంతృప్తికి గురి చేసింది. దీంతో కీలక నేతలు సైతం టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ప్రజాసేవలో పాలుపంచుకుంటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారీ్టలు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆయన పాలనా దక్షతకు ఆకర్షితుడినై వైఎస్సార్సీపీలో చేరా. ప్రజాసేవలో నా వంతుగా పాలు పంచుకుంటా. – రామగురివిరెడ్డి, చాగలమర్రి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అందరికీ సముచిత స్థానం దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, స్థానికంగా మా నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న వారందరికీ సముచిత స్థానం కల్పిస్తాం. అందరినీ సమన్వయం చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు వారి స్థాయికి తగ్గ పదవులు ఇప్పించేందుకు కృషి చేస్తాం. – ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి చదవండి: అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..! కళా వెంకట్రావు ఓ డిక్టేటర్.. ఆడియో హల్చల్ -
గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నందివాడ మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దాసరి మేరీ విజయకుమారి.. మంత్రి కొడాలి నాని సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. పరిషత్ ఎన్నికలు బహిష్కరించిన బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేరీ విజయ రాజీనామా చేశారు. ఆమెతో పాటుగా, పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి మంత్రి కొడాలి నాని.. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆనాడు స్పందించని పవన్.. ఇప్పుడు మాట్లాడటం విడ్డూరం.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. పూర్తి అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ వివేకా హత్య జరిగిందని.. ఆనాడు స్పందించని పవన్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలోనే వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైంది. తండ్రి హత్య కేసుపై కుమార్తె సీబీఐని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ‘‘పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన డైలాగ్‌లు, స్క్రిప్ట్‌ను చదువుతున్నాడు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. విపక్షాలు మత విద్వేషాల ద్వారా లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తున్నాయి. దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమని’’ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. చదవండి: దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..? హిందూపురంలో బాలకృష్ణకు ఝలక్ -
రాష్ట్రంలో నియంత పాలన
బాబు-చినబాబుకు కమీషన్లపైనే మోజు కూలీలను కాదని తెలుగు తమ్ముళ్లకు ‘ఉపాధి’ రైతులను ఆదుకోవడంలోనూ ఘోరంగా విఫలం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత ధ్వజం కణేకల్లు : రైతు, పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో నియంతన పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. తండ్రీకొడుకులు (చంద్రబాబు- లోకేష్) ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. మండలకేంద్రమైన కణేకల్లులో టీడీపీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వరుస కరువులతో జిల్లాలోని రైతులు, కూలీలు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు దుర్భర జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కూలీలకు ‘ఉపాధి’ కల్పించకుండా.. జేసీబీలతో పనులు చేయించి తెలుగు తమ్ముళ్ల జేబులు నింపుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్నదాతలు వేరుశనగ, శనగ, పత్తి, వరి తదితర పంటలు కోల్పోయి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతే ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనయుడు లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలవలేడని భావించిన చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. జనరంజక పాలన రావాలంటే అది వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగన్‌పై విశ్వాసం ఉంచి వైఎస్సార్సీపీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదువులిచ్చి ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్రమైనార్టీ సెల్ కన్వీనర్ నదీం అహమ్మద్ మాట్లాడుతూ మైనార్టీ మంత్రి లేకుండా ఉన్న ప్రభుత్వం టీడీపీ అని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరం పెంచేది, తెలుగు ప్రజలు తల ఎత్తుకునేలా చేసే పార్టీ వైఎస్సార్‌సీపీయేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మాధవరెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజనాయక్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, పార్టీ మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు ఉషారాణి, పీఏసీఎస్ అధ్యక్షులు మారెంపల్లి మారెన్న, రాయదుర్గం పట్టణ అధ్యక్షులు నబీష్, డి.హిరేహళ్, గుమ్మఘట్ట మండల కన్వీనర్లు వన్నూరుస్వామి, కాంతారెడ్డి, సేవాదళ్ కన్వీనర్ కె.విక్రంసింహారెడ్డి, నాయకులు టి.కేశవరెడ్డి, జీఎంఎస్ సర్మస్, చంద్రమోహన్‌రెడ్డి, టీఎస్ఎస్ రవూఫ్, మక్బుల్, చిన్న సర్మస్ తదితరుల పాల్గొన్నారు. మంత్రి ఇలాకాలో టీడీపీకి ఎదురుదెబ్బ కణేకల్లు : రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నుంచి 300 మంది వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మైనార్టీసెల్ రాష్ట్ర కన్వీనర్ నదీం అహమ్మద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డిల సమక్షంలో టీడీపీ నాయకులు, కణేకల్లు మత్స్యకార్మికుల సంఘం మాజీ అధ్యక్షులు పెద్దదేవర నబీసాబ్తోపాటు సయ్యద్, ఉలుకు ఫకృద్దీన్, రహముతుల్లా, బెస్త నాగరాజు, ఫకృద్దీన్, మల్లిఖార్జున, జావేద్, చోట హుసెన్, ఇమాం, వన్నూరా, జాకీర్, నబీ తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. వీరి రాకతో దాదాపు కణేకల్లులోని మత్స్యకార్మికులంతా సుమారు 90శాతం వైఎస్సార్సీపీలో వచ్చినట్లైంది. ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, అందుకే అధికార తెలుగుదేశం పార్టీ వీడి.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీలో చేరామని పెద్దదేవర నబీసాబ్ పేర్కొన్నారు. -
జేసీ కోటకు బీటలు
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలంలోని ఇగుడూరులో శుక్రవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ«ధ్వర్యంలో పలువురు టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రాజు, గంగాధర్, రామక్రిష్ణ , వెంకట్, విజయ్‌బాబు, గంగయ్య, ఓబయ్య, గంగరాజు, మోహన్, లక్ష్మినారాయణ, చిన్నకంబగిరిలతో పాటు 80 కుటుంబాల వారు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీ సబ్‌ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయకుండా ఎస్సీలను మోసం చేయడంతోనే టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి చేరినట్లు వారు తెలిపారు. జేసీ సోదరులకు మద్దతుగా ఉన్న గ్రామంలో చీలిక రావడంతో జేసీ కోటకు బీటలు వాలినట్లు అయింది. -
వైఎస్సార్సీపీలో చేరిన టీఆర్ఎస్ నేత
హన్మకొండ: ఖమ్మం జిల్లా ఎర్రుపాలం మండలం రెమిడిచర్ల ఎంపీటీసీ సభ్యుడు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాపు వరప్రసాదరావు టీఆర్ఎస్ను వీడి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం వరంగల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన కాపు వరప్రసాదరావును షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి టి.నర్సిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ కె.నగేష్, పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొత్స
మాజీ ఎంపీ ఝాన్సీ, మాజీ ఎమ్మెల్యే అప్పలనర్సయ్య సహా పెద్దఎత్తున చేరిన అనుచరగణం సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తన అనుచరగణంతో ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బొత్సతోపాటుగా ఆయన సతీమణి ఝాన్సీ(మాజీ ఎంపీ), సోదరుడు అప్పల నర్సయ్య(మాజీ ఎమ్మెల్యే) తదితరులుసహా పెద్ద ఎత్తున నేతలు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీలో చేరారు. భారీ సంఖ్యలో అనుచరులు వెంట రాగా పీసీసీ మాజీ చీఫ్ బొత్స ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్‌లోని జగన్ నివాసానికి చేరుకున్నారు. తనతోపాటుగా కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్న విజయనగరం జిల్లా ముఖ్య నేతలందర్నీ జగన్‌కు పరిచయం చేసి పార్టీ కండువాలు కప్పించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వై.వి.సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శులు ఎంవీ మైసూరారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, విజయనగ రం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి(ఎమ్మెల్సీ), మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, కె.పార్థసారథి, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, దాడిశెట్టి రాజా, బూడి ముత్యాలనాయుడు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కారుమూరు నాగేశ్వరరావుతో సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీరభద్రస్వామి, సాంబశివరాజులను జగన్ ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. విజయనగరం కాంగ్రెస్ ఖాళీ... బొత్స, ఆయన అనుచరులు వైఎస్సార్సీపీలో చేరికతో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. మాజీ ఎమ్మెల్యేలు బి.అప్పలనాయుడు, పి.సూర్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ ఎం.తులసి, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్వీ రమణరాజు, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వై.రమణమూర్తి, మాజీ డీసీసీ అధ్యక్షుడు పి.విజయకుమార్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఉమామల్లేశ్వరరావు, అర్బన్ బ్యాంకు చైర్మన్ పువ్వాజ నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నేతలు ఎం.శ్రీనివాసరావు, మరో 62 మంది ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లాలో ఒకటీ అరా నాయకులు మినహా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారంతా వైఎస్సార్సీపీలో చేరారని బొత్స స్వయంగా వెల్లడించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొత్స
-
వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి మోపిదేవి అనుచరులు