trs mptc
-
గొర్రెల కాపరిగా టీఆర్ఎస్ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500
TRS MPTC Working As Shepherd At Daily Wage Rs.500 Wanaparthy District Pangal Mandal Pics Goes Viral పాన్‌గల్ (వనపర్తి జిల్లా): ఇతని పేరు సుబ్బయ్యయాదవ్. వనపర్తి జిల్లా పాన్‌గల్ మం డలం శాగాపూర్‌కు చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు. ఆయన ప్రజాప్రతినిధి అయినప్పటికీ చేసేందుకు పనులు లేకపోవడంతో గ్రామానికి చెందిన ఆడేం రాములు, కొమ్ము బిచ్చన్న వద్ద గొర్రెల కాపరిగా రూ.500ల రోజువారీ కూలికి రెండు రోజులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సుబ్బయ్యయాదవ్ పేర్కొంటున్నారు. (చదవండి: హరీశ్.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో) -
ఉలిక్కిపడ్డ తెలంగాణ, ఎవరీ శారదక్క?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని తూర్పు అటవీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యు డు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు హత్య చేయడంతో కలకలం రేగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులు ఓ ప్రజాప్రతినిధిని చంపడం ఇదే తొలిసారి. పోలీసులు ముఖ్యంగా తూర్పు తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయడంతోపాటు నిరంతరం కూంబింగ్‌లు జరుపుతూ మావోయిస్టుల కార్యకలాపాలు నివారించగలిగారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలతో మావోయిస్టులు కలకలం సృష్టించారు. తెలంగాణలో తిరిగి పట్టు సాధించే ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే పార్టీ సెంట్రల్ కమిటీ.. తెలంగాణలో కార్యకలాపాలను హరిభూషణ్‌కు అప్పగిం చినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం ఏజెన్సీ, ఏటూరునాగారం ఏజెన్సీ పరిధిలో కొత్త కమిటీలు కూడా వేశారు. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ ఉండ గా, కొత్తగా వెంకటాపురం–వాజేడు కమి టీని నియమించారు. జూన్ ఆఖరి వారంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వేప నారాయణ అలియాస్ హరిభూషణ్, మరో నేత బడే చొక్కారా వులతోపాటు 20 మంది మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించారని నిఘావర్గాలు పోలీసులను అప్రమత్తం చేశాయి. ఇంతలోనే మావో యిస్టులు శ్రీనివాసరావును హత్య చేశారు. చదవండి: ఇన్ఫార్మర్ నెపంతో చంపేశారు ఎవరీ శారదక్క? శ్రీనివాసరావు మృతదేహం వద్ద పార్టీ కార్యదర్శి శారద పేరుతో మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం గంగారం గ్రామానికి చెందిన శారద (40) హరిభూషణ్ భార్య. ఆమెను జజ్జరి సమ్మక్క అలియాస్ సారక్క, అలియాస్ శారదగా పిలుస్తారు. జూన్ ఆఖరిలో వారంలో హరిభూషణ్‌తోపాటు శారద కూడా తెలంగాణలోకి వచ్చిందన్న పోలీసుల అనుమానాలు తాజా ఘటనతో నిజమయ్యాయి. కోటేశ్వరరావు రాకతో పెరిగిన దూకుడు మావోయిస్టు పార్టీ బాధ్యతలను నంబాల కోటేశ్వరరావు తీసుకున్నప్పటి నుంచి దూకుడు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వరస దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే బీమా మండవితోపాటు నలుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. మే ఒకటో తేదీన గడ్చిరోలిలో పోలీసు కాన్వాయ్ మీద దాడి చేయడంతో 16 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. -
టీఆర్ఎస్ ఎంపీటీసీ కిడ్నాప్
చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్త కొత్తూరులో టీఆర్ఎస్కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... శ్రీనివారావు ఇంటికి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో సుమారు 30 మంది మావోయిస్టులు వచ్చారు. ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో నేరుగా బెడ్రూంలోకి వెళ్లి నిద్రిస్తున్న శ్రీనివాసరావును లేపారు. బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా భార్య దుర్గ, కుమారుడు ప్రవీణ్‌కుమార్ అడ్డుపడ్డారు. దీంతో దుర్గకు ఒక మావోయిస్టు తుపాకీ చూపించి బెదిరించాడు. ప్రవీణ్‌ను కూడా పక్కకు నెడుతుండగా అతడికి మావోయిస్టులకు మధ్య పెనుగులాట జరిగింది. తమకు అడ్డు తగులుతున్నాడనే నెపంతో మరో మావోయిస్టు ప్రవీణ్‌కుమార్ తలపై కర్రతో బలంగా కొట్టడంతో తల పగిలింది. మరో మావోయిస్టు వచ్చి తుపాకీ చూపించి దుర్గ, ప్రవీణ్‌కుమార్‌ను అడ్డగించి శ్రీనివాసరావును బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. మావోయిస్టులు ఒక ద్విచక్రవాహనాన్ని వెంట తెచ్చుకోగా.. వెళ్లే సందర్భంలో ఇంటి బయట ఉన్న శ్రీనివాసరావు ద్విచక్ర వాహనాన్ని కూడా తీసుకెళ్లారు. మావోయిస్టులు తీసుకొచ్చిన ద్విచక్రవాహనంపై ఎక్కించే క్రమంలో నిరాకరించిన శ్రీనివాసరావును అక్కడ కూడా కర్రలతో కొట్టినట్లు తెలిసింది. అక్కడి నుంచి కిష్టారంపాడు మీదుగా దండకారణ్యానికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. శ్రీనివాసరావు ఇంటికి వచ్చిన 30 మంది మావోయిస్టుల్లో 10 మంది వద్ద తుపాకులు, మిగిలిన వారి వద్ద విల్లంబులు, కర్రలు, కత్తులు, గొడ్డళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
రేణికుంట ఎంపీటీసీ రాజీనామా
తిమ్మాపూర్ (కరీంనగర్ జిల్లా): రేణికుంట ఎంపీటీసీ సభ్యురాలు బోయిని రేణుక మంగళవారం తన పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం జరిగిన మండల సమావేశంలో తమకు అన్యాయం చేశారని, ఆ బాధతోనే తాను రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వంతోపాటు, ఎంపీటీసీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌కు అందజేశారు. మండల సమావేశం మధ్యలో కూర్చుని తన నిరసన తెలిపి అనంతరం బయటకు వెళ్ళిపోయారు. -
వైఎస్సార్సీపీలో చేరిన టీఆర్ఎస్ నేత
హన్మకొండ: ఖమ్మం జిల్లా ఎర్రుపాలం మండలం రెమిడిచర్ల ఎంపీటీసీ సభ్యుడు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాపు వరప్రసాదరావు టీఆర్ఎస్ను వీడి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం వరంగల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన కాపు వరప్రసాదరావును షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి టి.నర్సిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ కె.నగేష్, పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.