రేణికుంట ఎంపీటీసీ రాజీనామా
Published Tue, Mar 7 2017 1:42 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
తిమ్మాపూర్ (కరీంనగర్ జిల్లా): రేణికుంట ఎంపీటీసీ సభ్యురాలు బోయిని రేణుక మంగళవారం తన పదవికి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం జరిగిన మండల సమావేశంలో తమకు అన్యాయం చేశారని, ఆ బాధతోనే తాను రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు.
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వంతోపాటు, ఎంపీటీసీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌కు అందజేశారు. మండల సమావేశం మధ్యలో కూర్చుని తన నిరసన తెలిపి అనంతరం బయటకు వెళ్ళిపోయారు.
Advertisement
Advertisement